Begin typing your search above and press return to search.

సలార్.. ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది

By:  Tupaki Desk   |   18 Sep 2023 4:23 AM GMT
సలార్.. ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే?
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ సలార్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ సిరీస్ లో పార్ట్ 1 రిలీజ్ కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ కావడం వలన సెప్టెంబర్ 28 అనుకున్న డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడనేది కన్ఫర్మ్ చేయలేదు.

పూర్తిస్థాయిలో క్వాలిటీ వచ్చి దర్శకుడు ప్రశాంత్ సంతృప్తి చెందిన తర్వాత నెక్స్ట్రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఎనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ నుంచి కూడా క్లారిటీ వచ్చింది. అయితే ఈ ఏడాదిలోనే మేగ్జిమం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నవంబర్, డిసెంబర్ లో సరైన డేట్ చూసుకొని రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారం.

అయితే డిసెంబర్ 22 రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారంట. క్రిస్మస్ సీజన్ ఉండటంతో ఈ టైంలో రిలీజ్ చేస్తే ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుందని ఓపెనింగ్స్ కూడా గట్టిగా వస్తాయని అనుకుంటున్నారు. అయితే ఆ టైంలో అన్ని భాషలలో 8 నుంచి 10 సినిమాల వరకు రిలీజ్ కావడానికి సిద్ధమైపోయాయి. వీటిలో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాల వరకు ఉన్నాయి.

అయితే వాటికి పోటీగా సలార్ బరిలోకి దిగితే మాత్రం తట్టుకోవడం కష్టం అని చెప్పొచ్చు. సలార్ మీద పోటీగా సినిమా రిలీజ్ చేయడం కంటే వాయిదా వేసుకోవడానికే నిర్మాతలు మొగ్గు చూపిస్తారు. సలార్ రిలీజ్ ఎప్పుడైనా ఆడియన్స్ అంతా అటువైపు డైవర్ట్ అయిపోతారు. ఆ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేసిన ప్రయోజనం ఉండదని కొని ఫెయిల్యూర్ కొనితెచ్చుకోవడం అవుతుందని భావిస్తున్నారు.

అయితే డిసెంబర్ 22 కూడా ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ లేదని, ఆ సమయానికి విఎఫ్ఎక్స్ రిజక్ట్ ఆశించిన స్థాయిలో సంతృప్తికరంగా రాకుంటే వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.