Begin typing your search above and press return to search.

రాజాసాబ్ కి ఆ ఇద్దరితో ఫుల్ గ్లామర్ షో

ప్రభాస్ కి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు హీటెక్కించే బ్యూటీస్ ఉండటంతో సినిమాలో కావాల్సినంత గ్లామర్ షో ఉంటుందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   22 April 2024 4:03 AM GMT
రాజాసాబ్ కి ఆ ఇద్దరితో ఫుల్ గ్లామర్ షో
X

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ రాజాసాబ్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హర్రర్ కామెడీ జోనర్ లో మారుతి సిద్ధం చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అన్నింటిలో తక్కువ బడ్జెట్ మూవీ అంటే రాజాసాబ్ అని చెప్పాలి. ప్రభాస్ తన సినిమాలలో ఫన్ జెనరేట్ చేసి చాలా ఏళ్ళు అయిపొయింది. ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ కామెడీ పండించారు. ఆ తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత కంప్లీట్ పాన్ ఇండియా యాక్షన్ హీరోగా మారిపోయాడు.

ఆడియన్స్ నుంచి ఎక్కువగా యాక్షన్ బేస్డ్ కథలనే ప్రభాస్ నుంచి చూడటానికి ఇష్టపడుతున్నారు. ఆడియన్స్ ని కంప్లీట్ రీఫ్రెష్ మోడ్ లోకి తీసుకొని వెళ్ళడానికి ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సౌత్ ఇండియన్ క్రేజీ హీరోయిన్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్స్ గా ఉన్నారు. అలాగే రిద్ధి కుమారి కీలక పాత్రలో నటిస్తోంది.

ప్రభాస్ కి నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇద్దరు హీటెక్కించే బ్యూటీస్ ఉండటంతో సినిమాలో కావాల్సినంత గ్లామర్ షో ఉంటుందనే మాట వినిపిస్తోంది. నిధి అగర్వాల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి జోడీగా హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. దీంతో ఆమె రాజాసాబ్ మీదనే హోప్స్ పెట్టుకుంది.

ఈ సినిమాలో ఆమె అందాల ప్రదర్శనతో ఆడియన్స్ ని అలరిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక మాళవిక మోహనన్ తమిళ్ డబ్బింగ్ సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులకి చేరువ అయ్యింది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు. అందుకే యూత్ లో మాళవికకి ఎక్కువ క్రేజ్ ఉంది. తెలుగులో మాళవిక మోహనన్ కి రాజాసాబ్ లక్కీ ప్రాజెక్టు కాబోతోంది. ఇక ఈ మూవీ క్లిక్ అయితే ఇద్దరు గ్లామర్ హీరోయిన్స్ కి కూడా మంచి బ్రేక్ దొరుకుతుందని భావిస్తున్నారు.