Begin typing your search above and press return to search.

ప్రభాస్ రెమ్యునరేషన్.. టైమ్ తో కొలిస్తే ఎంత?

అయితే థియేటర్లలో సలార్ చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Jan 2024 8:01 AM GMT
ప్రభాస్ రెమ్యునరేషన్.. టైమ్ తో కొలిస్తే ఎంత?
X

గతేడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. థియేటర్లలో ఓ రేంజ్ లో అలరించిన ఈ సినిమా.. ఈమధ్యే ఓటీటీలోకి కూడా వచ్చింది. అక్కడ కూడా ట్రెండింగ్‌ లో ఉంటూ అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. అయితే థియేటర్లలో సలార్ చూస్తున్నప్పుడు గమనించని చాలా విషయాలు.. ఓటీటీలోకి వచ్చాక బయటపడిన విషయం తెలిసిందే.

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు. సాహో మూవీ కాస్త పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్స్‌ గా నిలిచాయి. దీంతో అందరూ సలార్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అలా గతేడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా నెట్‌ ఫ్లిక్స్‌ లో రిలీజై రికార్డులు సృష్టిస్తోంది.

అయితే సలార్ లో ఫైట్స్ తో ప్రభాస్ అదరగొట్టినప్పటికీ.. సినిమా 2 గంటల 55 నిమిషాల రన్‌ టైమ్‌ లో కేవలం 2 నిమిషాల 35 సెకన్లు మాత్రమే డైలాగ్స్ చెప్పారు. దీంతో కొందరు నెటిజన్లు ప్రభాస్ డైలాగులతో వీడియో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. డైలాగ్ టైమింగ్ తో ప్రభాస్ రెమ్యునరేషన్ ను కంపేర్ చేస్తున్నారు.

సలార్ సినిమాకు గాను ప్రభాస్.. రూ.125 కోట్ల పారితోషకం తీసుకున్నారని అప్పట్లో టాక్ వినిపించింది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూస్తే డార్లింగ్.. సెకనుకు రూ.80,64,516 సంపాదించినట్లే. అంటే నిమిషానికి పదుల కోట్లు అందుకున్నట్లే. భారతీయ సినీ ఇండస్ట్రీలో సెకనుకు లక్షలు.. నిమిషానికి కోట్లు సంపాదించిన రికార్డు ప్రభాస్‌ దేనన్న మాట!

మరోవైపు, ప్రభాస్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీలో నటిస్తున్నారు. దీంతోపాటు మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు. మే9వ తేదీన కల్కి మూవీ రిలీజ్ కానుండగా... రాజా సాబ్ 2024 చివర్లో విడుదల అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.