Begin typing your search above and press return to search.

ఆ వాయిదా 'రాజాసాబ్‌' కి కలిసి వచ్చిందా...?

మే 9న కల్కి సినిమాను విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులు పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది

By:  Tupaki Desk   |   23 March 2024 2:30 PM GMT
ఆ వాయిదా రాజాసాబ్‌ కి కలిసి వచ్చిందా...?
X

ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది సమ్మర్ కానుకగా కల్కి సినిమాతో ప్రభాస్ వస్తాడని, మరో భారీ విజయం నమోదు అవ్వబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మే 9న కల్కి సినిమాను విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్‌ సభ్యులు పార్లమెంట్‌ ఎన్నికల కారణంగా ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ మొత్తాన్ని పూర్తి చేశామని ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

మే నెలలో కల్కి సినిమా విడుదల ఉండక పోవడం వల్ల ప్రభాస్‌ ఆ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన డేట్లను గంపగుత్తగా రాజాసాబ్ సినిమా షూటింగ్‌ కోసం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్‌ నెల నుంచి దాదాపుగా నెలన్నర రోజుల పాటు రాజాసాబ్‌ షూటింగ్‌ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా గురించి గత రెండేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమధ్య రాజాసాబ్‌ సినిమా ఫస్ట్ లుక్ వచ్చింది. మొన్నటి వరకు సినిమా పై అనుమానాలు పెట్టుకున్న ఫ్యాన్స్‌ ఫస్ట్‌ లుక్‌ చూసిన తర్వాత సినిమా గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కల్కి సినిమా వాయిదాను మారుతి వినియోగించుకుని రాజాసాబ్‌ సినిమా షూటింగ్‌ ను ముగించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా ప్రభాస్ సమయం దొరికినప్పుడు రాజాసాబ్ కి ప్రభాస్ డేట్లు ఇస్తూ వస్తున్నాడు. దాంతో షూటింగ్ చాలా స్లోగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది.