Begin typing your search above and press return to search.

రాజా సాబ్ రోజు బ‌డ్జెట్‌తో ఒక‌ సినిమా పూర్తి చేస్తా

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు సుజీత్‌తో క‌లిసి ఓజి లాంటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం ప‌ని చేస్తున్నారు

By:  Tupaki Desk   |   25 March 2024 3:55 AM GMT
రాజా సాబ్ రోజు బ‌డ్జెట్‌తో ఒక‌ సినిమా పూర్తి చేస్తా
X

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు సుజీత్‌తో క‌లిసి ఓజి లాంటి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కోసం ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లు పైగా బ‌డ్జెట్ ని కేటాయించార‌ని టాక్ ఉంది. కీల‌క‌మైన షెడ్యూళ్ల కోసం రోజుకు కోట్ల‌లో బ‌డ్జెట్ ఖ‌ర్చ‌వుతోంది. ఇంత‌కుముందు సాహో కోసం సుజీత్ రోజువారీ బ‌డ్జెట్ కోట్ల‌లోనే ఉంది. మునుముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేషన్ లో తెర‌కెక్క‌నున్న ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ చిత్రం కోసం ఏకంగా 600 కోట్లు అంత‌కుమించిన బ‌డ్జెట్ ని కేటాయించనున్నార‌ని, దీనిని అంత‌ర్జాతీయ మార్కెట్లోను పాన్ వ‌ర‌ల్డ్ బిజినెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంటే రోజువారీగా కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ ని కేటాయించాల్సి ఉంటుంది. బాహుబ‌లి- సాహో మొద‌లు ప్ర‌భాస్ న‌టిస్తున్న ప్ర‌తి సినిమాకి రోజుకు కోట్ల‌లో ఖ‌ర్చ‌వుతోంది. ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న క‌ల్కి కోసం రోజువారీగా కోట్లాది రూపాయ‌ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌వుతోంది. అయితే ఇవ‌న్నీ స్పాన్ ప‌రంగా అతిభారీ కాన్వాస్ ను క‌లిగి ఉన్నాయి గ‌నుక ఇంత భారీగా వెచ్చించాల్సి వ‌స్తోంది.

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో తొలిసారి ప‌ని చేస్తున్న ప‌రిమిత బ‌డ్జెట్ల ద‌ర్శ‌కుడు మారుతి తాజా చిత్రం 'రాజా సాబ్' కోసం రోజుకు ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు? అంటూ నెటిజ‌నుల్లో ఆరాలు కొన‌సాగుతున్నాయి. తాజాగా దీనికి స‌మాధానం వ‌చ్చింది. త‌న డెబ్యూ సినిమా 'ఈరోజుల్లో' కేవ‌లం 30ల‌క్ష‌ల బ‌డ్జెట్ లో పూర్తి చేసిన‌ మారుతి, రాజాసాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించినట్లు సమాచారం. అంటే రోజుకు కోటి ఖ‌ర్చ‌వుతోంద‌న్న‌మాట‌. ఒక‌వేళ ప్రభాస్ సినిమా కాకపోతే ఈ బడ్జెట్‌లో రెండు మూడు చిత్రాలు తెర‌కెక్కించేవాడిని, ఒక్క రోజు బ‌డ్జెట్ తో ఒక‌ సినిమా పూర్తి చేసేసేవాడిని.. అని మారుతి వ్యాఖ్యానించారు.

కెరీర్ ఆరంభం నుంచి ప‌రిమిత బ‌డ్జెట్ల‌తో నిర్మాత‌ల‌కు గ్యారెంటీ రిట‌ర్నులు వ‌చ్చేలా సినిమాల్ని ప్లాన్ చేయ‌డం మారుతికి అల‌వాటు. పెద్ద హీరోల‌తో ఆఫ‌ర్లు ఉన్నా కానీ, న‌వ‌త‌రం హీరోల‌తో ప్ర‌యోగాలు చేసేందుకే ఆస‌క్తిని క‌న‌బ‌రిచారు. క‌మ‌ర్షియ‌ల్ గా వంద‌శాతం రిట‌ర్నులు వ‌చ్చేలా అత‌డి ప్ర‌ణాళిక‌లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో డేరింగ్ గా గ‌ట్సీగా ప‌ని చేస్తున్నాడు కాబ‌ట్టి, మునుముందు అల్లు అర్జున్ స‌హా అగ్ర హీరోల‌తో మారుతి ప‌ని చేసేందుకు లైన్ క్లియ‌రైన‌ట్టే. రాజాసాబ్ రిజ‌ల్ట్ మారుతికి త‌దుప‌రి బిగ్ బ‌డ్జెట్ చిత్రాల‌ మార్గాన్ని మ‌రింత సుగ‌మం చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.