Begin typing your search above and press return to search.

రాజాసాబ్.. అంత తక్కువంచనా వేయొద్దేమో..

ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ఓ వర్గం ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహపడ్డారు

By:  Tupaki Desk   |   19 March 2024 10:37 AM GMT
రాజాసాబ్.. అంత తక్కువంచనా వేయొద్దేమో..
X

ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అనగానే ఓ వర్గం ఫ్యాన్స్ అయితే చాలా నిరుత్సాహపడ్డారు. కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి బాక్సాఫీస్ వద్ద కొన్ని మంచి లాభాలను అందించే చిత్రాలను అందించాడు. అయితే అతను అదే తరహాలో వెళ్లడంతో కొన్ని డిజాస్టర్లు కూడా ఎదురయ్యాయి. చివరగా వచ్చిన మంచిరోజులోచ్చాయి, పక్కా కమర్షియల్ సినిమాలు మరింత దారుణంగా డిజాస్టర్ అయ్యాయి.

అయితే ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా అతను సరైన కంటెంట్ అందించకపోవచ్చు అని మరికొందరు నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. ఇక ఫ్యాన్స్ లో ఆ భావాలను మెల్లమెల్లగా తగ్గించాలి అనుకున్నారో ఏమో కానీ ప్రాజెక్టును అయితే అఫీషియల్ గా ప్రకటించకుండా సైలెంట్ గా మొదలుపెట్టేశారు. ఒక విధంగా ఇంత సైలెంట్ గా ఇప్పటివరకు ఏ ఏ స్టార్ హీరో సినిమాను మొదలుపెట్టలేదు అని చెప్పవచ్చు.

ఇక ఒక్కొక్క అప్డేట్ అందిస్తూ వచ్చిన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తప్పకుండా కంటెంట్ మాత్రం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని భరోసా ఇస్తూ వచ్చారు. ఇక మారుతి కూడా పలు ఇంటర్వ్యూలలో ఎక్కువగా దాని గురించి మాట్లాడకుండా ఫ్యాన్స్ కోరుకునే విధంగానే సినిమా ఉంటుంది అని సరికొత్త కంటెంట్ కూడా అందులో ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు.

ఇక వాళ్ళు ఎంత చెప్పినా కూడా నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక వాటిని పట్టించుకోని మేకర్స్ మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పరవాలేదు అనిపించారు. ఈ సినిమా హారర్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది అని ముందుగానే హింట్ అయితే వచ్చింది. ఇక రీసెంట్ గా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మరో క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అని అది ఎవరు ఊహించని విధంగా ఉంటాయని అన్నారు. ఇక సినిమా అయితే విజువల్ వండర్ అనేలా వెండితెరపై హైలెట్ అవుతుంది అంటూ తప్పకుండా అంచనాలకు తగ్గట్టుకుని ఉంటుంది అని తెలిపారు. అలాగే కల్కి సినిమా ముందుగా రాబోతోంది కాబట్టి ఇప్పుడే అప్డేట్స్ ఇవ్వడం కరెక్టు కాదు అనే ఆలోచనతో కంటెంగ్ వదలట్లేదు అని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

సినిమాలో హై విజువల్స్ ఉంటాయని ఆయన క్లారిటీ ఇవ్వడంతో సినిమాను అంత తక్కువగా అంచనా వేయడానికి లేదు అనే విధంగా మరికొందరు ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా మారుతి మాత్రం తన కెరీర్ లోనే మొదటిసారి అతిపెద్ద ప్రాజెక్టు చేస్తుండడంతో చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటాడు అని చెప్పవచ్చు. అందులోనూ ప్రభాస్ సినిమా కాబట్టి ఇది సక్సెస్ అయితేనే కెరీర్ మరో లెవెల్లో ఉంటుంది అని అతనికి బాగా తెలుసు. దీంతో పెన్నుకు గట్టిగానే పవర్ పట్టినట్లుగా అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఆ స్థాయిలో క్లిక్ అవుతుందో లేదో తెలియాలి అంటే రాబోయే అప్డేట్స్ బట్టి అర్థమవుతుంది. ఇక సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నారు.