Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ రాజా డీలక్స్ ఫైనల్ గా 'రాజా సాబ్‌'

రాజా డీలక్స్ అనే ఒక పాడుబడ్డ థియేటర్‌ చుట్టు సాగే కథ కనుక ఆ టైటిల్‌ ను అనుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   12 Jan 2024 9:49 AM GMT
ప్రభాస్‌ రాజా డీలక్స్ ఫైనల్ గా రాజా సాబ్‌
X

యంగ్ రెబల్‌ స్టార్‌ సలార్‌ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నాగ్ అశ్విన్‌ కల్కి సినిమాను రూపొందిస్తున్నాడు. మరో వైపు మారుతి కూడా ప్రభాస్ తో ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.

ఏడాది కాలంగా ప్రభాస్‌, మారుతి సినిమా గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కానీ మేకర్స్ నుంచి ఒక అధికారిక ప్రకటన రాలేదు. సలార్‌ హిట్ ఉత్సాహంలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు దర్శకుడు మారుతి సిద్ధం అయ్యాడు. ఇప్పటికే సంక్రాంతికి తమ సినిమా అఫిషిల్‌ లుక్‌ మరియు టైటిల్‌ అనౌన్స్మెంట్‌ అంటూ ప్రకటించారు.

ప్రభాస్‌, మారుతి కాంబోలో సినిమాను ప్రకటించిన సమయంలో రాజా డీలక్స్ అనే టైటిల్‌ ప్రచారం జరిగింది. రాజా డీలక్స్ అనే ఒక పాడుబడ్డ థియేటర్‌ చుట్టు సాగే కథ కనుక ఆ టైటిల్‌ ను అనుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ టైటిల్ కాదని ఆ తర్వాత మేకర్స్ ఆఫ్ ది రికార్డ్‌ చెప్పారు.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న సినిమా కనుక అన్ని భాషలకు తగ్గట్లుగా టైటిల్‌ ఉండాలి అనే ఉద్దేశ్యంతో రాయల్‌, అంబాసిడర్‌ అనే టైటిల్స్ ను పరిశీలించారు. తాజాగా ఈ సినిమాకు రాజా సాబ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్‌ చేయడం జరిగిందని తెలుస్తోంది.

సంక్రాంతి సందర్భంగా రాజా సాబ్‌ టైటిల్‌ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసేందుకు గాను మారుతి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్స్‌ ఎవరు, ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్‌ ఏంటి ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు మరికొన్ని గంటల్లో తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.