Begin typing your search above and press return to search.

ఆ విషయం మర్చిపోయేలా చేసిన ప్రభాస్..!

బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లిగోల మొదలైంది. సాహో టైం లో ప్రభాస్ మీడియా ముందుకు వస్తే చాలు పెళ్లెప్పుడని ఎటాక్ చేశారు.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:05 PM GMT
ఆ విషయం మర్చిపోయేలా చేసిన ప్రభాస్..!
X

8 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి సినిమా టైం లోనే ప్రభాస్ పెళ్లెప్పుడని మీడియా ఒకటే హడావిడి చేయగా బాహుబలి కాగానే చేస్తానని అన్నాడు. బాహుబలి సెట్స్ మీదకు వెళ్లినప్పుడు రెండు భాగాలు అనుకోలేదు. రాజమౌళి పుణ్యమాని ఆ సినిమా రెండు భాగాల కోసం ఐదేళ్లు టైం పట్టింది. ఆ ఐదేళ్లు ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన రాలేదు. బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ పెళ్లిగోల మొదలైంది. సాహో టైం లో ప్రభాస్ మీడియా ముందుకు వస్తే చాలు పెళ్లెప్పుడని ఎటాక్ చేశారు.

సాహో తర్వాత రాధే శ్యాం కోసం 3 ఏళ్లు టైం తీసుకున్న ప్రభాస్ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడ కనిపించినా సరే పెళ్లెప్పుడంటూ మీడియా ప్రశ్నలు సంధించేది. కానీ ప్రభాస్ వారి ప్రశ్నలకు సైలెంట్ గా తోసిపుచ్చేవారు. ఈ సినిమా కాగానే పెళ్లి అంటూ ప్రభాస్ చెప్పడం అందరు సైలెంట్ అవ్వడం ఇదే రిపీట్ అయ్యింది.

రాధే శ్యాం తర్వాత ఆదిపురుష్, సలార్ రెండు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యాయి. అయితే చిన్నగా ప్రభాస్ పెళ్లి గురించి కాకుండా తను చేసే సినిమాల గురించి మీడియా ఫోకస్ చేసేలా చేశాడు. వరుసగా 3, 4 పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను సెట్స్ మీద ఉంచడం వల్ల ప్రభాస్ పెళ్లి మ్యాటర్ వదిలి ఆ సినిమాల అప్డేట్స్ మీద పడ్డారు.

ప్రభాస్ పెళ్లి మ్యాటర్ తనంతట తాను చెప్పాలనుకుంటే తప్ప.. తనంతట తాను ఫిక్స్ అయితే తప్ప ఎప్పుడన్నది చెప్పడం కష్టం. అప్పటివరకు మీడియా వాళ్లు ఎంత అడిగినా సరే వేస్ట్ అని అర్థమవుతుంది. ఈమధ్య ప్రభాస్ కనిపించినా సరే పెళ్లి ప్రస్తావన తెచ్చినా వృధా ప్రయాస అని మీడియా వాళ్లు కూడా సైలెంట్ అయ్యారు. ఇంతకీ అసలు ప్రభాస్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా బాలీవుడ్ సల్మాన్ ఖాన్ లానే బ్యాచిలర్ గా ఉండాలని ఫిక్స్ అయ్యాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ప్రభాస్ చేస్తున్న కల్కి సినిమా సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేశారు. మే 9న డేట్ లాక్ చేయగా ఇప్పుడు సినిమా ఆ టైం కు వస్తుందా రాదా అన్న డౌట్ ఉంది. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా మాత్రం నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కలి, రాజా సాబ్ తో పాటుగా సలార్ 2 ని కూడా పూర్తి చేసి ఆ తర్వాత సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు ప్రభాస్.