Begin typing your search above and press return to search.

ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్ వద్దంటున్న ఫ్యాన్స్..!

హీరోయిన్ ఎంపికలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నారు. వరుస సినిమాల ఆఫర్లతో శ్రీ లీల సత్తా చాటుతున్నా వాటి ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.

By:  Tupaki Desk   |   27 Jan 2024 4:45 AM GMT
ప్రభాస్ పక్కన ఆ హీరోయిన్ వద్దంటున్న ఫ్యాన్స్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేసేలా వరుస సినిమాలు చేస్తున్నారు. అంతకుముందు సినిమా రిలీజ్ లకు రెండేళ్లు టైం తీసుకున్న ప్రభాస్ లాస్ట్ ఇయర్ ఆదిపురుష్, సలార్ రెండు సినిమాలతో రాగా ఈ ఇయర్ కూడా కల్కి, రాజా సాబ్ రెండు సినిమాలతో వస్తున్నాడని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించనున్నాయని అంటున్నారు. ఐతే ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ వంగాతో స్పిరిట్, హను రాఘవపుడితో ఒక సినిమా చేస్తున్నాడు. సందీప్ వంగ సినిమా కాస్త లేట్ అయ్యేలా ఉంది అందుకే హను రాఘవపుడితో సినిమా ముందు సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను నెక్స్ట్ ప్రభాస్ తో చేసే సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంతో ఒక అద్భుతమైన ప్రేమ కథతో ఈ సినిమా రాబోతుందని టాక్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. హీరోయిన్ ఎంపికలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ గా ఉన్నారు. వరుస సినిమాల ఆఫర్లతో శ్రీ లీల సత్తా చాటుతున్నా వాటి ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.

అందుకే ప్రభాస్ సినిమాలో శ్రీలీల అంటే బాబోయ్ ఆ హీరోయిన్ వద్దే వద్దని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. అయినా ఫ్యాన్స్ కావాలంటే తీసుకోవడం.. వద్దంటే కాదనుకోవడం జరగదు కానీ శ్రీలీల విషయంలో ఆమె ఫ్లాపులే ఆమె పాలిట బ్యాడ్ లక్ గా మారాయి. ప్రభాస్ శ్రీలీల జోడీగా హను రాఘవపుడి సినిమా ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో శ్రీలీల వద్దని రెబల్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరి సినిమా మొదలయ్యే టైం కి ఫ్యాన్స్ అభ్యర్ధన గురిచి అభిమాన హీరో ఆలోచిస్తాడా లేదా అన్నది చూడాలి.

ప్రభాస్ హను కాంబో మూవీ ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం హను భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నాడట. సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్.