Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్పీడుకు బ్రేకులు.. మంచిదేలే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 April 2024 5:42 AM GMT
ప్రభాస్ స్పీడుకు బ్రేకులు.. మంచిదేలే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బీ టౌన్ బ్యూటీ దిశా పటానీ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది.

అయితే ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రూపొందిస్తున్నారు. వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. 34 ఏళ్ల క్రితం.. చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి రిలీజైన రోజే కల్కిని విడుదల చేయాలని భావించారు. కానీ ఇంతలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మే 13వ తేదీ తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని అంతా భావిస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ సినిమా వాయిదాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అనుకున్న డేట్ కాకపోతే బాహుబలి రిలీజైన జులై 10న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జులై 10వ తేదీ బుధవారం కనుక.. ఆ వారంలో ఏదో రోజు రిలీజ్ చేయాలనుకుంటున్నారట. త్వరలోనే మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుందట. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు పోస్ట్ పోన్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

ప్రస్తుతం ప్రభాస్ రిలాక్స్ మోడ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుండడం పక్కా అని సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ పూర్తి చేయనున్నారు. కామెడీ కమ్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేశారట.

చాలా రోజులుగా ప్రభాస్ తీరిక లేకుండా చాలా స్పీడ్ గా షూటింగ్స్ లలో పాల్గొంటున్నారు. ఇక కల్కి వాయిదా ఆయన స్పీడ్ కు బ్రేకులు వేయడమే కాకుండా కాస్త విశ్రాంతి తీసుకునే టైమ్ కూడా ఇచ్చింది. ఇక కల్కి విషయానికొస్తే.. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. ప్రభాస్ పాత్ర ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుందని స్వప్న దత్ తెలిపారు. ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్నే దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించారని, అందరినీ అబ్బురపరిచేలా విజువల్స్ ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి. మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.