Begin typing your search above and press return to search.

ప్రభాస్ - హను.. ఫైనల్ గా లక్కున్న అమ్మాయే!

సీతారామం సినిమాతో లక్కీ గర్ల్ గా మారిపోయిన మృణాల్ ఠాగూర్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   11 March 2024 7:54 AM GMT
ప్రభాస్ - హను.. ఫైనల్ గా లక్కున్న అమ్మాయే!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఈ కాంబినేషన్ పై అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం జరగాల్సిన పనులు వేగంగానే కొనసాగుతూ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ తెరపైకి తీసుకురాబోతున్న ఈ కలయిక లో ఒక సరికొత్త లవ్ స్టోరీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

వరల్డ్ వార్ నేపథ్యంలో దర్శకుడు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎవరెవరిని సెలెక్ట్ చేస్తున్నారు అనే విషయంలో చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక దర్శకుడు హను నిర్ణయం మేరకే నిర్మాతలు హీరో ప్రతి విషయంలో ఓకే చెబుతున్నట్లుగా తెలుస్తోంది. హను కి ఇబ్బంది లేకుండా ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో సీతారామం సినిమాతో రుజువయింది.

అందుకే అతని నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలి అని మైత్రి డిసైడ్ అయింది. ఇక ప్రభాస్ అయితే ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కథ వరకు కొన్ని రోజులు సిట్టింగ్స్ లో కూర్చున్న ప్రభాస్ మొత్తం ఓకే అనుకున్న తర్వాత టెక్నీషియన్స్, నటీనటులను నువ్వే సెలెక్ట్ చేసేయ్ అని ప్రభాస్ డైరెక్టర్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇక దర్శకుడు దాదాపు సీతారామం యూనిట్ ను ప్రభాస్ సినిమా కోసం కంటిన్యూ చేసేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. హను దగ్గర ఎప్పటినుంచో మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నా విశాల్ చంద్రశేఖర్ కూడా ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఎవరు అనే విషయంలో కూడా చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి.

ఇక ఆ విషయంలో కూడా దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సీతారామం సినిమాతో లక్కీ గర్ల్ గా మారిపోయిన మృణాల్ ఠాగూర్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది నానితో చేసిన హాయ్ నాన్న సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది.

ఇక ఇప్పుడు ప్రభాస్ తో కూడా జతకట్టే అవకాశం దొరికింది. గతంలోనే ఈ కాంబినేషన్ పై గాసిప్స్ వచ్చినప్పటికీ చర్చల్లోకి మరో ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వచ్చాయి. కానీ అటు ఇటు తిరిగి మళ్ళీ హను రాగవపూడి హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ పాపనే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ క్లారిటీ ఇవ్వడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి మారుతీ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి. కల్కి విడుదల తర్వాతనే ఈ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.