Begin typing your search above and press return to search.

రెబల్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి..!

కల్కి సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మే 9 నుంచి దాదాపు వాయిదా పడినట్టే అని అంటున్నారు

By:  Tupaki Desk   |   16 April 2024 11:30 AM GMT
రెబల్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి..!
X

బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫ్యాన్స్ కు సూపర్ ఫీస్ట్ అందిస్తున్న ప్రభాస్ వాటిలో వారికి ఫుల్ మీల్స్ పెట్టే సినిమాగా ఒక్క సలార్ ని మాత్రమే ఇచ్చాడని చెప్పొచ్చు. సలార్ 1 సినిమా తో ఫ్యాన్స్ ఆకలి తీర్చిన ప్రభాస్ కల్కితో పాన్ వరల్డ్ ఆడియన్స్ కు మరో ట్రీట్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో వస్తున్న కల్కి సినిమా పాన్ వరల్డ్ సినిమాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వస్తుంది. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

కల్కి సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. మే 9 నుంచి దాదాపు వాయిదా పడినట్టే అని అంటున్నారు. కొత్త రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్నారు. ప్రభాస్ వరుస సినిమాలు చేయడం వరకు బాగానే ఉంది కానీ ఆ సినిమా రిలీజ్ ల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచే దాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది.

కల్కి రిలీజ్ పై కొనసాగుతున్న చర్చ చూస్తుంటే ఇప్పుడప్పుడే అదు వచ్చేలా లేదని చెప్పొచ్చు. కల్కి మాత్రమే కాదు ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాజా సాబ్ సినిమా కూడా రిలీజ్ పై చర్చ జరుగుతుంది. మేకర్స్ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ అని చెబుతున్నా సినిమా సంక్రాంతికి రావడం కష్టమే అని తెలుస్తుంది. రాజా సాబ్ తర్వాత ప్రభాస్ ముందు స్పిరిట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకోగా ప్లాన్ మార్చి సలార్ 2 ను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.

మొత్తానికి ప్రభాస్ సినిమాల ప్లానింగ్ బాగున్నా అనుకున్న టైం కు రిలీజ్ చేయక ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. అయితే టైం తీసుకున్నా సరే ఫ్యాన్స్ కు ఆడియన్స్ కు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు మాత్రమే ప్రభాస్ అలా చేస్తున్నాడని చెబుతున్నారు. కల్కి మే మిస్సైతే జూన్ లేదా జూలై రిలీజ్ అంటున్నారు. అది మిస్సైతే మాత్రం డిసెంబర్ లోనే ఛాన్స్ ఉంటుంది. అయితే సంక్రాంతికి రాజా సాబ్ రిలీజ్ అనుకున్నా అదైనా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అన్నది చూడాలి.