Begin typing your search above and press return to search.

ప్రభాస్ పవర్ఫుల్ లైనప్.. మూడేళ్ళలో 6 సినిమాలు

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా చక్రం తిప్పుతున్న ప్రభాస్ ప్రస్తుతం పవర్ఫుల్ సినిమాలతో సిద్ధమవుతున్నాడు

By:  Tupaki Desk   |   29 Feb 2024 11:30 AM GMT
ప్రభాస్ పవర్ఫుల్ లైనప్.. మూడేళ్ళలో 6 సినిమాలు
X

నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా చక్రం తిప్పుతున్న ప్రభాస్ ప్రస్తుతం పవర్ఫుల్ సినిమాలతో సిద్ధమవుతున్నాడు. గతంలో ఎప్పుడూ లేనంత బిజీగా షూటింగ్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ తో ఇప్పుడు సినిమా చేయాలని అనుకునే వారికి డేట్స్ అంత త్వరగా దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ మూడేళ్ల వరకు బిజీగా ఉండేలా సినిమాలను సెట్ చేసుకున్నాడు.దాదాపు 6 సినిమాలు ఇప్పుడు లైన్ లో ఉన్నాయి.

మరికొన్ని చర్చల దశలో ఉండగా వాటిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్ లో పెట్టిన సినిమాల వివరాల్లోకి వెళితే.. నెక్స్ట్ అయితే కల్కి మొదటి భాగం రాబోతోంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇక లిస్టులో మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది చివర్లో విడుదల చేయాలని ఆలోచనతో ఉన్నారు. రాజాసాబ్ సినిమా కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది. ఇక ఆ తరువాత రాబోయే స్పిరిట్ పై అంచనాలు ఇప్పటికే ఒక రేంజ్ లో ఉన్నయి.

యానిమల్ సినిమాతో వండర్స్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరపైకి తీసుకురాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. మొదటిసారి పోలీస్ పాత్రలో ఏ విధంగా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలవుతుంది అని ఆ మధ్య కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రభాస్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ చేశాడు. అలాగే సీతారామం దర్శకుడు హను రాఘవపూడి తో కూడా ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ బ్యాగ్రౌండ్ లో మాత్రం వర్క్ జరుగుతూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వార్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరపైకి రానుంది.

మరోవైపు కల్కి 2898 AD పార్ట్ 2 కూడా రానుంది. ఫస్ట్ పార్ట్ విడుదలైన తరువాత మిగతా సినిమాలతో బిజీ కాబోతున్న ప్రభాస్ ఏడాది అనంతరం రెండో భాగంకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేయనున్నాడు. ఈ విధంగా ప్రభాస్ వచ్చే మూడేళ్ళ వరకు మొత్తంగా ప్రస్తుతానికి ఆరు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి ఈ సినిమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయో లేదో.