Begin typing your search above and press return to search.

బిజీ షెడ్యూల్ లో ఫ్రెండ్ షిప్ కోసం ప్రభాస్..!

ఇంత బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ తన ఫ్రెండ్ మంచు విష్ణు కోసం మూడు రోజులు డేట్స్ ఇస్తున్నాడు

By:  Tupaki Desk   |   28 Jan 2024 7:38 AM GMT
బిజీ షెడ్యూల్ లో ఫ్రెండ్ షిప్ కోసం ప్రభాస్..!
X

టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరో అంటే ముందు పేరు ప్రభాస్ అనే చెప్పొచ్చు. వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రభాస్ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు. డిసెంబర్ లో సలార్ 1 రిలీజైందో లేదో అటు కల్కి, ఇటు రాజా సాబ్ రెండు సినిమాలకు షిఫ్ట్ వైజ్ పనిచేస్తున్నాడు ప్రభాస్. ఆ సినిమాలు రెండిటినీ ఈ ఇయర్ రిలీజ్ చేయాలన్నదే ప్రభాస్ ప్లాన్. ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉండనే ఉన్నాయి.

ఇంత బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ తన ఫ్రెండ్ మంచు విష్ణు కోసం మూడు రోజులు డేట్స్ ఇస్తున్నాడు. మంచు విష్ణు లీడ్ రోల్ లో 100 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమా వస్తుందని తెలిసిందే. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ కొంత పార్ట్ జరిగింది. హాలీవుడ్ టెక్నిషియన్స్ తో మంచు విష్ణు లాంగ్ షెడ్యూల్ తో సినిమా కొంత భాగం పూర్తి చేశారు.

ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా భాగం అవుతున్నాడని తెలిసిందే. ఆల్రెడీ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పింది. ఇప్పుడు సినిమా కోసం ప్రభాస్ తో 3 రోజుల షూట్ ప్లాన్ చేశారట మంచు విష్ణు. ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో ప్రభాస్ కన్నప్ప షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇచ్చిన మాట కోసం ప్రభాస్ తనకున్న బిజీ షెడ్యూల్ లో కూడా కన్నప్ప కోసం పనిచేస్తున్నాడు.

ప్రభాస్ తో 3 రోజుల షూటింగ్ కూడా న్యూజిలాండ్ లోనే నిర్వహిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తారని టాక్. అయితే ఈ 3 రోజుల షూటింగ్ తోనే ప్రభాస్ పోర్షన్ కంప్లీట్ అవుతుందా లేదా మళ్లీ ఈ సినిమాకు ప్రభాస్ అవకాశం ఉన్నప్పుడల్లా డేట్స్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ప్రభాస్ మాత్రం ఇలా తన సాయం అడిగితే కాదనకుండా చేస్తుంటాడు. మంచు విష్ణు సినిమా కోసం అంతకుముందు వాయిస్ ఓవర్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా కన్నప్పలో ఒక ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు. సినిమాలో ప్రభాస్ నటించడం ఆ సినిమాకు ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.