Begin typing your search above and press return to search.

మరోసారి ప్రభాస్ బ్లాస్టింగ్ రికార్డ్

ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, ఇప్పుడు సలార్ సినిమాలు ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరాయి

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:52 AM GMT
మరోసారి ప్రభాస్ బ్లాస్టింగ్ రికార్డ్
X

డార్లింగ్ ప్రభాస్ తన మాస్ ఇమేజ్ ని సినిమా సినిమాకి పెంచుకుంటున్నాడు. బాహుబలి సిరీస్ తోనే దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న డార్లింగ్ కి తరువాత మూడు సినిమాలు చెప్పుకోదగ్గ సక్సెస్ లు ఇవ్వలేదు. అయిన కూడా సలార్ తో తన పవర్ ఏంటో మళ్ళీ చూపించాడు. ఈ మూవీ కేవలం ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇకా కలెక్షన్స్ ప్రభంజనం సాగుతోంది.

హిందీలో ఆరంభంలో డంకీ మూవీ కారణంగా థియేటర్స్ ఆశించిన స్థాయిలో లభించలేదు. అయితే టాక్ బాగుండటంతో ఇప్పుడు డంకీని తీసేసి సలార్ ని ఆ థియేటర్స్ లో రిప్లేస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సలార్ సినిమా ద్వారా ప్రభాస్ తన ఖాతాలో మరో రికార్డ్ ని చేర్చుకున్నాడు. ఇప్పటి వరకు మూడు సినిమాలతో ఐదు వంద కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన ఏకైక ఇండియా హీరోగా నిలిచాడు.

ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2, ఇప్పుడు సలార్ సినిమాలు ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరాయి. సాహో మూవీ ఐదు వందల కోట్లకి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే కల్కి, స్పిరిట్ సినిమాలు కూడా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ ని సునాయాసంగా దాటేసే చిత్రాలే కావడం విశేషం. వీటితో పాటు సలార్ 2 కూడా ఉండనే ఉంది. ఈ మూవీ కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ.

ఇప్పటికే ఐదు సార్లు వంద కోట్లకి పైగా గ్రాస్ ని మొదటిరోజే అందుకున్న ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు 500 కోట్లతో మరో రేర్ ఫీట్ అందుకున్నాడు. కల్కి మూవీతో మొట్టమొదటి పాన్ వరల్డ్ హీరోగా ప్రభాస్ మరో రికార్డ్ ని సృస్టించబోతున్నాడు. ఈ మూవీతో హాలీవుడ్ సైతం ఇండియన్ సినిమాల వైపు తిరిగి చూసేలా చేయబోతున్నాడని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

లుక్ మీద కాస్తా శ్రద్ధ తీసుకుంటే ప్రభాస్ ఇమేజ్ ని ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకే హీరో కూడా అందుకునే ఛాన్స్ ఉండకపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. భవిష్యత్తులో అతని సినిమాలతో రికార్డుల పరంపర కొనసాగిస్తాడని భావిస్తున్నారు.