Begin typing your search above and press return to search.

రెబల్ స్టార్ మాస్ మేనియా షురూ..!

అయితే ప్రభాస్ లైనప్ లో దాదాపు 10 సినిమాల దాకా ఉన్నాయని తెలుస్తుంది. కల్కి మొదటి పార్ట్ తో పాటుగా రాజా సాబ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తవుతుంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:33 AM GMT
రెబల్ స్టార్ మాస్ మేనియా షురూ..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కల్కి, రాజా సాబ్ తో పాటుగా మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలిసిందే. అయితే ప్రభాస్ లైనప్ లో దాదాపు 10 సినిమాల దాకా ఉన్నాయని తెలుస్తుంది. కల్కి మొదటి పార్ట్ తో పాటుగా రాజా సాబ్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత హను రాఘవపుడి సినిమా ఉందని టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.

ఈ సినిమాలతో పాటుగా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరోపక్క బోయపాటి శ్రీను కూడా ప్రభాస్ కోసం ఒక లైన్ కొన్నేళ్లుగా దాచి ఉంచారని తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో రాజమౌళి మరో సినిమా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాడట. రాజమౌళి మహేష్ తో చేసే సినిమా అయ్యాక ప్రభాస్ తోనే సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు.

వీటితో పాటుగా సలార్ 2 ఇంకా కల్కి భాగాలు కూడా ఉండనే ఉన్నాయి. సో ఈ లెక్కన చూస్తే ప్రభాస్ 10 సినిమాల దాకా షెడ్యూల్ ఫిల్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలన్నీ వస్తే మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. ప్రభాస్ సినిమాల లైనప్ మిగతా స్టార్ హీరోలకు కూడా షాక్ ఇస్తుందని చెప్పొచ్చు.

ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడి ఈ సమ్మర్ కి రిలీజ్ చేస్తుండగా రాజా సాబ్ సినిమాను 2025 సంక్రాంతికి లాక్ చేశారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే స్పిరిట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. నేషనల్ లెవెల్ లో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా తను చేస్తున్న సినిమాల మీద భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

కల్కి సినిమా అయితే హాలీవుడ్ రేంజ్ సినిమా అని చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి కల్కితో మరోసారి బాహుబలి రేంజ్ బాక్సాఫీస్ వసూళ్లను ప్రభాస్ సాధిస్తాడా లేదా అన్నది చూడాలి. కల్కి మాత్రమే కాదు రాజా సాబ్ కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయడం ఖాయమని చెబుతున్నారు.