Begin typing your search above and press return to search.

ప్రభాస్.. మారుతి నిజంగా అంత ఖర్చు పెట్టిస్తున్నాడా?

ఇక ఫైనల్ గా మారుతితో కథ సెట్ కావడంతో వీలైనంతవరకు ఆ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తోనే రూపొందించాలని అనుకున్నారు

By:  Tupaki Desk   |   15 Nov 2023 3:30 PM GMT
ప్రభాస్.. మారుతి నిజంగా అంత ఖర్చు పెట్టిస్తున్నాడా?
X

బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలో బడ్జెట్ అన్నీ కూడా ఊహించని స్థాయికి పెరిగిపోతున్నాయి. అయితే మధ్యలో మాత్రం ప్రభాస్ తప్పకుండా తక్కువ బడ్జెట్ తో ఏదైనా సినిమా చేయాలని ఆలోచనతో వెళ్ళాడు. సాహో తర్వాత కూడా మళ్లీ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా రావడంతో ఆ ఛాన్స్ వదులుకోలేకపోయాడు.

ఇక ఫైనల్ గా మారుతితో కథ సెట్ కావడంతో వీలైనంతవరకు ఆ సినిమాను 80 కోట్ల బడ్జెట్ తోనే రూపొందించాలని అనుకున్నారు. మారుతి తక్కువ బడ్జెట్ లో పర్ఫెక్ట్ కంటెంట్ ఇస్తాడు అని ప్రభాస్ కూడా నమ్మాడు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. కేవలం ప్రభాస్ రెమ్యునరేషన్ మాత్రమే ఎక్కువ అయినట్లు తెలుస్తోంది.

ఇక సినిమా మిగతా బడ్జెట్ మాత్రం 100 కోట్లు లోపే ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ సెట్స్ పైకి వెళ్ళిన తర్వాత ఈ సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయిందట. దర్శకుడు మారుతి మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి నిర్మాతలతో మాట్లాడే బడ్జెట్ పెంచినట్లుగా తెలుస్తోంది. కేవలం వీఎఫ్ఎక్స్ వర్క్ కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని లేటెస్ట్ గా కొన్ని వాసిప్స్ అయితే ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి.

కొందరైతే ఆ లెక్క 250 కోట్లు వరకు వెళ్లిందని కూడా చెబుతున్నారు. ఇక ప్రభాస్ మాత్రం తక్కువ బడ్జెట్ లో సినిమా చేయాలి అనుకున్న ప్రతిసారి కూడా అది వర్కౌట్ కావడం లేదు. ఇక మారుతి దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టు బడ్జెట్ అయితే మొత్తంగా 250 కోట్ల ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉందట. ప్రభాస్ కు ఎలాగూ బలమైన మార్కెట్ ఉంది కాబట్టి సినిమా బిజినెస్ లో పెద్దగా ఎఫెక్ర్ ఏమి పడదు.

ప్రమోషన్ కంటెంట్ క్లిక్కయితే సినిమా విడుదలకు ముందే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్ ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు 2025 సంక్రాంతికి రావచ్చు. ఇక మారుతి డైరెక్ర్ చేస్తున్న సినిమా అదే ఏడాది సమ్మర్ తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.