Begin typing your search above and press return to search.

ప్రభాస్ వార్ లవ్ స్టోరీ… బడ్జెట్ ఎంతంటే?

డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్ కి వెళ్ళిపోయింది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోతుంది

By:  Tupaki Desk   |   29 Jan 2024 4:37 AM GMT
ప్రభాస్ వార్ లవ్ స్టోరీ… బడ్జెట్ ఎంతంటే?
X

డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ లెవల్ కి వెళ్ళిపోయింది. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ పెరిగిపోతుంది. సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ మేలో గ్లోబల్ మూవీ కల్కి2898 ఏడీతో రాబోతున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అలాగే ఇప్పటి వరకు రానటువంటి ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో మూవీ ఉండబోతోంది. కచ్చితంగా నాగ్ అశ్విన్ కల్కితో భూమిపైనే ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడని అందరూ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. ఈ ఏడాది డిసెంబర్ లో మూవీ రిలీజ్ కావొచ్చు. బాహుబలి సిరీస్ తర్వాత అతి తక్కువ బడ్జెట్ తో ప్రభాస్ ఈ మూవీ చేస్తున్నాడు.

వంద కోట్ల వరకు ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారని టాక్. దీని తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ ఉంటుందని చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. సీతారామం మూవీతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న హను రాఘవపూడి దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కి తెలుగులో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చాడు. దీని తర్వాత మరల లవ్ స్టోరీతోనే మూవీ చేయాలని హను రాఘవపూడి ప్లాన్ చేసుకుంటున్నాడు.

అయితే ఈ సారి గ్రాండ్ స్కేల్ పైన ప్రేమకథని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఆవిష్కరించాలని అనుకుంటున్నాడు. అందుకోసమే ప్రభాస్ కి కథ చెప్పి ఒకే చేయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో మూవీ కథఉండే ఛాన్స్ ఉందంట. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా శ్రీలీలని ఎంపిక చేసుకున్నారనే ప్రచారం నడుస్తోంది.

మూవీ కోసం మైత్రీ మూవీ మేకర్స్ వారు 300 నుంచి 400 కోట్ల మధ్యలో ఖర్చు చేయబోతున్నారంట. సినిమాలో వార్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయని, అలాగే 1945 నేటివిటీని ఎస్టాబ్లిష్ చేసే విధంగా సెట్స్ కూడా ప్రత్యేకంగా వేయనున్నారంట. దీనికోసం భారీగా మూవీ కోసం ఖర్చు చేస్తున్నట్లు టాక్ తెరపైకి వచ్చింది.