Begin typing your search above and press return to search.

ప్రభాస్ అంటే క్రష్‌.. విజయ్‌ ఆ సినిమాలు నచ్చలేదు!

రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా పీవీ సింధు ఏదో ఒక విషయం తో హాట్‌ టాపిక్ గా ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 11:30 AM GMT
ప్రభాస్ అంటే క్రష్‌.. విజయ్‌ ఆ సినిమాలు నచ్చలేదు!
X

తెలుగు బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు కు హీరోయిన్ స్థాయి పాపులారిటీ సోషల్‌ మీడియాలో ఉంది. రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా పీవీ సింధు ఏదో ఒక విషయం తో హాట్‌ టాపిక్ గా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోలపై వ్యాఖ్యలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రభాస్ అంటే క్రష్‌ అంది. తనకు ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం అంటూ గతంలోనే చెప్పుకొచ్చిన సింధు మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేసింది.

విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు తనకు నచ్చలేదని సింధు చెప్పుకొచ్చింది. ఆ సినిమాలు ఏంటి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ సినిమాలు నాకు నచ్చకున్నా ఇతరులకు నచ్చి ఉండవచ్చు. ఇప్పుడు ఆ సినిమాలు ఏంటి అనేది నేను చెప్తే వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.

ఆటతో అలసి పోయిన సమయంలో తాను సినిమాలు చూసి రిలాక్స్ అవుతాను అంటూ సింధు చెప్పుకొచ్చింది. ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం అంది. సినిమా స్టార్స్‌ కూడా చాలా కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు. వారు చేసిన సినిమాలు హిట్ అవుతాయా లేదా అనే టెన్షన్ ఉంటుంది.

గతంలో సింధు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబర్చుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు నిజం కాదని మరోసారి కొట్టిపారేసింది. తన బయోపిక్ తీస్తే బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పదుకునే చేస్తే బాగుంటుందని సింధు మరోసారి చెప్పుకొచ్చింది.