Begin typing your search above and press return to search.

ప్రభాస్ - మారుతి.. నిద్రలేచే టైమొచ్చింది

సంక్రాంతి కానుకగా ఫ్యాన్స్ గా రాజా డీలాక్స్ మూవీ నుంచి చిన్న ట్రీట్ ఈ గ్లింప్స్ ద్వారా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇ

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:55 AM GMT
ప్రభాస్ - మారుతి.. నిద్రలేచే టైమొచ్చింది
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరో ఏడాది వరకు ప్రభాస్ కాల్షీట్స్ ఫుల్ అయిపోయాయి. ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటా అని ప్రభాస్ అభిమానులకి మాటిచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

ఆదిపురుష్ డిజాస్టర్ అయిన సలార్ తో మరోసారి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని దేశవ్యాప్తంగా హైలెట్ చేశాడు. ఈ ఏడాది సౌత్ ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకునే చిత్రంగా సలార్ కచ్చితంగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడీతో పాన్ వరల్డ్ రేంజ్ లో 2024లో ప్రభాస్ తన సత్తా చూపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ లో తక్కువ బడ్జెట్ తో రాజా డీలాక్స్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ చిత్రాన్ని మారుతి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ పండించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయడానికి మారుతి ప్లాన్ చేస్తున్నారంట. సంక్రాంతి కానుకగా ఫ్యాన్స్ గా రాజా డీలాక్స్ మూవీ నుంచి చిన్న ట్రీట్ ఈ గ్లింప్స్ ద్వారా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు మారుతి అదే పనిలో ఉన్నారని వినికిడి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తుంది.

అయితే ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా ఈ మూవీ చేస్తున్నాడని టాక్. అందుకే 100 నుంచి 150 కోట్ల మధ్యనే ఈ సినిమాకి బడ్జెట్ అవ్వనుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. అంటే సినిమా సక్సెస్ తరువాత బిజినెస్ లో వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్. మూవీలో మాళవిక నాయర్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఒక బంగ్లా నేపథ్యంలోనే కథ మొత్తం నడుస్తుందంట.