Begin typing your search above and press return to search.

ప్రభాస్, మారుతి.. ఎంతవరకు వచ్చారంటే..

మారుతి కెరియర్ లో కూడా ఇదే బిగ్ బడ్జెట్ మూవీ. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో మారుతి ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 1:30 PM GMT
ప్రభాస్, మారుతి.. ఎంతవరకు వచ్చారంటే..
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుమారు వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతోంది. ప్రభాస్ కంప్లీట్ గా యాక్షన్ నుంచి బయటకొచ్చి కామిక్ టచ్ తో ఈ సినిమా చేస్తున్నారు.

ఈ మూవీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయకుండానే షూటింగ్ కి వెళ్ళిపోయింది. రాజా డీలాక్స్ వర్కింగ్ టైటిల్ తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 40 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందంట. ఓ వైపు కల్కి2898 ఏడీ, సలార్ సినిమా షూటింగ్ లు చేస్తూనే మారుతి సినిమా చిత్రీకరణలో కూడా ప్రభాస్ పాల్గొంటూ వస్తున్నారు. సినిమా కథ మొత్తం ఒక ప్యాలస్ నేపథ్యంలోనే జరగనుంది.

ఈ కారణంగా షూటింగ్ 40 శాతం ఇప్పటికే కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. కల్కి షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మారుతి సినిమా కోసం కాల్ షీట్స్ కేటాయించనున్నాడంట.

మారుతి కెరియర్ లో కూడా ఇదే బిగ్ బడ్జెట్ మూవీ. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో మారుతి ఉన్నారు. ప్రభాస్ కూడా ఫ్యాన్స్ కి సరికొత్తగా కనిపించాలని డిఫరెంట్ కథతో ఈ మూవీ చేస్తున్నారు.

తమిళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోన్న మాళవిక మోహనన్ ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సినిమాపైన అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా ఎదగాలనే తన డ్రీంకి హెల్ప్ అవుతోందని భావిస్తోంది. ఇక మారుతి కెరియర్ కి కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట.

మరి ఇంత మంది బ్రేక్ కోసం వెయిట్ చేస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఒక వేళ కల్కి మూవీ ఆ టైంలో రిలీజ్ అయితే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.