Begin typing your search above and press return to search.

ప్రభాస్, మారుతి.. మరో క్రేజీ టైటిల్...!

ప్రభాస్ ని ఇప్పటి సినిమాల్లో కంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో లుక్ చూడటానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు

By:  Tupaki Desk   |   10 Aug 2023 1:30 PM GMT
ప్రభాస్, మారుతి.. మరో క్రేజీ టైటిల్...!
X

ప్రభాస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల ఆదిపురుష్ మూవీతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఆ సినిమా ఊహించనంత హిట్ కాలేకపోయింది. దీంతో, ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమాలో కోసం ఎదురుచూస్తున్నారు. సలార్, కల్కి సినిమాలు దాదాపు షూటింగ్స్ పూర్తి చేసుకున్నాయి. ప్రేక్షకుల ముందుకు రావడమే తరువాయి.

ఈ లోగా, ప్రభాస్ ఎప్పుడో అంగీకరించిన మారుతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. అయితే , మొన్నటి వరకు ఈ సినిమా కి వర్కింగ్ టైటిల్ గా డీలక్స్ రాజా అనే పేరును అనుకున్నారు. అదే పేరుతో ఈ ప్రాజెక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు అని అనుకున్నారు. కానీ, ఈ ప్రాజెక్ట్ పేరు ఇప్పుడు మారిపోయింది. ఈ మూవీకి మరో క్రేజీ పేరును పెట్టాలని అనుకుంటున్నారట.

వింటేజ్ కింగ్ అనే పేరు పెట్టాలని మూవీ టీమ్ భావిస్తోందట. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడం విశేషం. ఇక, ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ని ఇప్పటి సినిమాల్లో కంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాల్లో లుక్ చూడటానికి ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. ఆ కోరిక ఈ సినిమాతో తీరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టగా,పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో సంజయ్ దత్, జరీనా వహాబ్ లాంటి నటులు కీలక పాత్ర పోషిస్తుననట్లు సమాచారం. ఇక ఇద్దరు హీరోయిన్లు ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. మాళవిక మోహన్ తో పాటు రిద్దికుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు నిధి అగర్వాల్ కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది.

మారుతి స్టైల్ కామెడీ తో ఈ మూవీ ముందుకు సాగుతుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.