Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. ప్రభాస్-మారుతి అప్డేట్ ఆగయా

బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫుల్ బిజీ మోడ్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:18 AM GMT
హమ్మయ్యా.. ప్రభాస్-మారుతి అప్డేట్ ఆగయా
X

బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఫుల్ బిజీ మోడ్ లో ఉన్నారు. మరో ఏడాది వరకు ఆయన కాల్షీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఏటా పక్కాగా రెండు సినిమాలతో థియేటర్లలోకి వస్తానని మాట ఇచ్చిన ప్రభాస్.. చెప్పినట్లుగానే 2023లో ఆదిపురుష్, సలార్తో సందడి చేశారు.


ఇప్పుడు మారుతీతో ఓ మూవీ, నాగ అశ్విన్ తో కల్కి 2898 ఏడీ సినిమాలు చేస్తున్నారు. అయితే మారుతి మూవీ షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే ప్రారంభ‌మైంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ప్ర‌భాస్ మిన‌హా ఇందులో న‌టిస్తున్న హీరోయిన్లు, ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాల్ని సైతం వెల్ల‌డించ‌క‌పోవ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా ఇన్నాళ్లకు ప్రభాస్- మారుతి సినిమాకు సంబంధించి మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. సంక్రాంతికి ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోపాటు టైటిల్ ను రివీల్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సగర్వంగా డైనోసార్‌ ను సంపూర్ణ డార్లింగ్‌ గా మార్చిందని క్యాప్షన్ ఇచ్చారు. ప్ర‌భాస్ లుక్‌ ను షాడోలో చూపిస్తూ ఓ మ‌ల్టీ క‌ల‌ర్ పోస్ట‌ర్‌ ను రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. డార్లింగ్ ను కలర్ ఫుల్ గా మారుతి చూపించనున్నారని కామెంట్లు చేస్తున్నారు. డైనోసార్ మళ్లీ డార్లింగ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారని సందడి చేస్తున్నారు.

నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో మారుతి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్లు స‌మాచారం. ఓ బంగ్లా నేపథ్యంలో ఈ సినిమా మొత్తం స్టోరీ ఉండనుందట. ఈ మూవీకి రాజా డీల‌క్స్ అనే పేరు ఖ‌రారు చేయ‌బోతున్న‌ట్లు ఎప్పటి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు సమాచారం. ప్ర‌భాస్‌ సరసన మాళ‌వికా మోహ‌న‌న్‌, రిధి కుమార్, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారట.

అయితే ప్రభాస్ ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారని టాక్. కానీ సినిమా సక్సెస్ తరువాత బిజినెస్ లో వాటా తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నారట. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.