Begin typing your search above and press return to search.

ప్రభాస్ మార్కెట్.. అంతకంతకూ పెరుగుతూనే..

బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం సినిమాలు కూడా ప్రభాస్ మూవీస్ చేసేంత బిజినెస్ చేయవు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 9:32 AM GMT
ప్రభాస్ మార్కెట్.. అంతకంతకూ పెరుగుతూనే..
X

డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఏంటో సినిమా గురించి తెలిసిన ఎవరిని అడిగిన చెబుతారు. ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోలని చూసుకుంటే అందులో మొదటి స్థానంలో డార్లింగ్ ప్రభాస్ ఉంటాడని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోలైన ఖాన్ త్రయం సినిమాలు కూడా ప్రభాస్ మూవీస్ చేసేంత బిజినెస్ చేయవు.

అలాగే ప్రభాస్ మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ ఎలాంటి డోకా ఉండదు. ఇక సూపర్ హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలు కంటెంట్ పరంగా పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోయాయి. ఈ కారణంగానే కలెక్షన్స్ వెయ్యి కోట్లకి రీచ్ కాలేదు. కానీ 500 కోట్లకి పైగా కలెక్షన్స్ చాలా ఈజీగా అందుకున్నాయి.

ఇక ప్రభాస్ సినిమాల బిజినెస్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే బాహుబలి మూవీ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం వలన 118 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. తరువాత బాహుబలి 2 ఏకంగా 352 కోట్ల బిజినెస్ చేయడం చేయడం. అలాగే ఇండియాలో హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ ఫీట్ అందుకోలేదు.

సాహో మూవీ 270 కోట్ల వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా జరిగింది. ఈ మూవీకి ఏవరేజ్ టాక్ వచ్చిన కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని అందుకుంది. నిర్మాతలు, బయ్యర్లకి కూడా లాభాలు వచ్చాయి. రాధేశ్యామ్ అయితే కనీసం డార్లింగ్ అభిమానులకి కూడా నచ్చలేదు. ఈ సినిమా మీద 202.80 కోట్ల వ్యాపారం జరిగింది. అయితే బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయింది.

ఆదిపురుష్ మూవీ 240 కోట్ల బిజినెస్ చేసింది. భారీ అంచనాల మధ్య మూవీ థియేటర్స్ లోకి వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న 500 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు సలార్ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రంపై 345 కోట్ల బిజినెస్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే కనీసం 346 కోట్లు కలెక్ట్ చేయాలి. సినిమా హిట్ పడితే మాత్రం మొదటి నాలుగు రోజుల్లోనే ఈ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఓవరాల్ గా ప్రభాస్ చివరి ఐదు సినిమాల ద్వారా 1,409.8 కోట్ల వ్యాపారం బాక్సాఫీస్ దగ్గర జరగడం విశేషం.