Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'కల్కి'.. కిక్కిచ్చే క్లైమాక్స్

ఈ క్లైమాక్స్ షూటింగ్లో ప్రభాస్ తో పాటు కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నానితో పాటూ మరికొందరు అగ్ర నటీనటులు పాల్గొంటారట.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:07 AM GMT
ప్రభాస్ కల్కి.. కిక్కిచ్చే క్లైమాక్స్
X

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898AD'. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే కదా.

ఇక గత కొద్ది రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాల్లో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. భారీ గ్రాఫిక్స్, VFX తో హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తీర్చిదిద్దుతున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూపించని ఓ సరికొత్త భవిష్యత్ ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

అదేంటంటే.. 'కల్కి' క్లైమాక్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా ఉండబోతుందట. ఈ సినిమా క్లైమాక్స్ లో బిగ్గెస్ట్ స్టార్స్ ఉంటారని తెలిసింది. అంటే సినిమాలో నటిస్తున్న స్టార్ కాస్ట్ తో క్లైమాక్స్ ఉంటుందట. వచ్చేవారం నుంచి మూవీ టీం క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ ని ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

ఈ క్లైమాక్స్ షూటింగ్లో ప్రభాస్ తో పాటు కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నానితో పాటూ మరికొందరు అగ్ర నటీనటులు పాల్గొంటారట. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలకు ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యామియోస్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో కమలహాసన్ పాత్ర క్లైమాక్స్ లో రివీల్ అవుతుందట.

ఆ తర్వాత పార్ట్-2 లో ప్రభాస్ - కమల్ హాసన్ మధ్య ఎపిక్ క్లాష్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మూవీ టీం సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ చిత్రాన్ని సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.