Begin typing your search above and press return to search.

కల్కి.. అప్డేట్స్ ఉన్నట్టా? లేనట్టా?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 AD. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం అవుతోంది

By:  Tupaki Desk   |   1 March 2024 4:07 AM GMT
కల్కి.. అప్డేట్స్ ఉన్నట్టా? లేనట్టా?
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 AD. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా సిద్ధం అవుతోంది. రెండు భాగాలుగా నాగ్ అశ్విన్ కల్కి మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇందులో పార్ట్ 1 మే నెలలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే డేట్ కూడా కన్ఫర్మ్ చేసేశారు.

ఏవైనా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ లేట్ అయితే వాయిదా పడే అవకాశం ఉంటుందని టాక్ వస్తోంది. మేగ్జిమమ్ అయితే అనుకున్న డేట్ కి ప్రేక్షకుల ముందుకి రావొచ్చు. అయితే మార్చి నెల మూడో వారంలో కల్కి టీజర్ వస్తుందని ప్రచారం జరిగింది. ఈ శివరాత్రికి మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. అయితే ఇప్పటి వరకు పోస్టర్ కూడా డిజైన్ చేయలేదని తెలుస్తోంది.

ఇక సాంగ్, టీజర్ లాంటివి కూడా ఏమీ సిద్ధం చేయలేదనే మాట వినిపిస్తోంది. ఈ మార్చి నెలలో మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే ఉండొచ్చు కాని వీడియో కంటెంట్ రావడం మాత్రం కష్టమే అనే టాక్ జోరుగా ప్రచారం అవుతోంది. నాగ్ అశ్విన్ సినిమా ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్న కూడా మూవీపైన హైప్ క్రియేట్ కావాలంటే కచ్చితంగా సాంగ్స్, టీజర్ లాంటివి పడాల్సిందే.

విజువల్స్ ని ఆడియన్స్ చూసినపుడు ఒక ఎక్స్ పెక్టేషన్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి మూవీపైన బజ్ క్రియేట్ అయ్యి మార్కెట్ లో సినిమా ప్రోడక్ట్ పై క్రేజ్ పెరుగుతుంది. అయితే ఈ విషయంలో నాగ్ అశ్విన్ ఇంకా బ్యాక్ లోనే ఉన్నారు. 2022లో మూవీ నుంచి ఒక గ్లింప్స్ వదిలారు. దాంతో కల్కి చిత్రంపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాలో నటిస్తోన్న క్యాస్టింగ్ కారణంగా కొంత బజ్ ఏర్పడింది.

మూవీ రిలీజ్ కి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. భారీ బడ్జెట్, గ్లోబల్ లెవల్ లో రిలీజ్ అవుతోన్న ఇలాంటి సినిమాకి ఇంటర్నేషనల్ లెవల్ లో హైప్ క్రియేట్ చేయాలంటే ఇప్పటి నుంచి వీడియో ప్రమోషన్ కూడా మొదలు పెడితే బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియాలో మొట్టమొదటి సారిగా వస్తోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఆడియన్స్ రిసీవ్ చేసుకోవాలంటే విజువల్స్ కి వారు అడిక్ట్ అయ్యేలా చేయాలని అంటున్నారు. మరి నాగ్ అశ్విన్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాడు అనేది చూడాలి.