Begin typing your search above and press return to search.

బ్యూటీతో డార్లింగ్ రొమాన్స్ మ‌సాలా ద‌ట్టించేనా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `క‌ల్కి 2898` చిత్రీక‌ర‌ణ ముగింపుకు చేరుకున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   19 Feb 2024 12:30 PM GMT
బ్యూటీతో డార్లింగ్ రొమాన్స్ మ‌సాలా ద‌ట్టించేనా?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న `క‌ల్కి 2898` చిత్రీక‌ర‌ణ ముగింపుకు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే కొత్త షెడ్యూల్ కూడా ప్రారంభ‌మైంది. దీనిలో భాగంగా ప్ర‌భాస్-దిశా ప‌టానీ మ‌ధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీక‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పాట అభిమానులు మెచ్చే ప్ర‌త్యేక రొమాంటిక్ గీతంలా నిలిచి పోతుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఈ పాట‌లో దిశా ప‌టానీని కాస్త బోల్డ్ గానే చూపించ‌బోతున్నారుట‌.

వాస్త‌వానికి నాగ్ అశ్విన్ సినిమాల్లో హీరోయిన్లు అంటే క్లీన్ అండ్ గ్రీన్ గా హైలైట్ అవుతుంటారు. కానీ క‌ల్కీ లో పాట రొమాన్స్ ని సైతం డిమాండ్ చేయ‌డంతో అశ్విన్ త‌న రూల్ ని సైతం ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు స‌మాచారం. మరి ఈ పాట‌లో జోడీని ఎంత అందంగా చూపిస్తారో చూడాలి. అయితే ఈ పాట క‌థానుగ‌ణంగా ఉంటుందట‌. ఎక్క‌డా స్టోరీని డీవియేట్ చేయ‌కుండా సీన్స్ లో భాగంగానే వస్తుందిట‌.

అంటే సినిమాలో దిశాప‌టానీ పాత్ర కూడా కీల‌క‌మ‌నే టాక్ వినిపిస్తుంది. అమ్మ‌డిని కేవ‌లం పాట‌కే ప‌రి మితం చేయ‌కుండా కీ రోల్ కూడా అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డే కొత్త క‌న్ ప్యూజ‌న్ కూడా తెర‌పైకి వ‌స్తోంది. దిశాతో తొలుత కీరోల్ పోషిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత చిన్న పాత్ర‌మే న‌ని మ‌రో ప్ర‌చారం సాగింది. దీంతో ఆమె పాత్ర‌పై క్లారిటీ మిస్ అయింది. కానీ తాజా స‌మాచారంతో పాట‌తో పాటు కీల‌క‌మైన పాట‌లోనూ న‌ర్తిస్తుంద‌ని తెలుస్తుంది.

ఇందులో ప్ర‌భాస్ కి జోడీగా దీపికా ప‌దుకొణే న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ జోడీని తెర‌పై చూడాల‌ని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి అలాంటి జోడీ మ‌ధ్య రొమాంటిక్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అన్న‌ది స‌స్పెన్స్. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చెప్పిన తేదీకే వ‌చ్చేస్తా అంటూ కాన్పిడెంట్ గా నే క‌నిపిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.