Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలో సీనియర్ స్టార్.. క్లారిటీ వచ్చేసింది

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం మే నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   1 March 2024 7:48 AM GMT
ప్రభాస్ సినిమాలో సీనియర్ స్టార్.. క్లారిటీ వచ్చేసింది
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ అడ్వెంచర్ మూవీ కల్కి 2898 AD సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం మే నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా రాకపోవచ్చు అని కొన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో వాయిదా పడవచ్చు అని ఇటీవల చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం అనుకున్న సమయానికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కష్టపడుతోంది. అయితే ఇప్పటికే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలు కావాలి కానీ ఇంకా కల్కి టీమ్ ఆ దిశగా వేగాన్ని పెంచడం లేదు.

సినిమా షూటింగ్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ తోనే చిత్ర యూనిట్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రధాన విలన్ గా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అలాగే గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇక మరి కొంతమంది యువ హీరోలు కూడా స్పెషల్ పాత్రల్లో కనిపిస్తారు అని చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఆ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు రీసెంట్ గా ఒక సీనియర్ హీరో ప్రముఖ నటుడు మాత్రం ప్రభాస్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. కల్కి సినిమాలో తను కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు నట కిరీటి రాజేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.

ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన ఆయన ప్రభాస్ తో మొదటిసారి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని త్వరలోనే మరొక షెడ్యూల్లో కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. తప్పకుండా ఆ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని చెప్పిన రాజేంద్రప్రసాద్ తన పాత్ర ఎలా ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి కల్కి సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి.