Begin typing your search above and press return to search.

ప్రభాస్ 'బుజ్జి' వచ్చేసింది.. సూపర్ ట్విస్ట్

బుజ్జి.. బుజ్జి.. బుజ్జి.. గత కొన్ని రోజులుగా ఆ బుజ్జి కోసమే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పోస్టే ఆ చర్చకు కారణం

By:  Tupaki Desk   |   19 May 2024 4:15 AM GMT
ప్రభాస్ బుజ్జి వచ్చేసింది.. సూపర్ ట్విస్ట్
X



బుజ్జి.. బుజ్జి.. బుజ్జి.. గత కొన్ని రోజులుగా ఆ బుజ్జి కోసమే చర్చ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పోస్టే ఆ చర్చకు కారణం. మన జీవితాల్లో ఎవరో వస్తున్నారంటూ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత నిన్న సాయంత్రం అప్డేట్ ఇస్తామని తెలిపారు. అయితే ప్రభాస్ కు మ్యారేజ్ ఫిక్స్ అయిందని అంతా అనుకోగా.. చివరకు అది కల్కి ప్రమోషన్స్ లో భాగమని తెలిసి ఒక్కసారిగా షాకయ్యారు. ఏదైతే ఏంటని అప్డేట్ కోసం ఎదురు చూశారు.

తీరా కల్కి మూవీని నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ బ్యానర్.. ఆ బుజ్జిని కాస్త లేట్ గా రివీల్ చేసింది! ఇంతలో ఫ్యాన్స్.. అంతా నెట్టింట ఫైర్ కూడా అయ్యారు. కొన్ని కారణాల వల్ల లేట్ అయిందని తెలిపి.. చివరకు ప్రభాస్ బుజ్జి గురించి 'Skratch EP4: Building A Superstar BUJJI' పేరుతో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో అంతా బుజ్జి గురించి మాట్లాడుతూ ఆడియన్స్ లో మరింతగా బజ్ క్రియేట్ చేశారు.

ఇప్పటికే అంతా అనుకుంటున్నట్లు ఆ బుజ్జి ఎవరో కాదు ఓ కారు. వీడియోలో "మన బాడీని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుందో.. బుజ్జిని కూడా ఓ బ్రెయినే అలా కంట్రోల్ చేస్తుంది" అని మేకర్స్ తెలిపారు. ఆ తర్వాత ఓ గ్యాడ్జెట్‌ మూవీ టీమ్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఫన్నీ గా తిట్లు తిడుతోంది. బుజ్జిని తయారు చేసిన వారిని కూడా పరిచయం చేశారు మేకర్స్. డైరెక్టర్‌ నాగ్ అశ్విన్, నిర్మాత స్వప్న దత్ సహా అంతా బుజ్జి గురించే మాట్లాడుకుంటారు.

ఇక చివర్లో భైరవ రోల్ లో హీరో ప్రభాస్ కనిపిస్తారు. అప్పుడు గ్యాడ్జెట్ ఇంకా నా లైఫ్ అంతా బాడీ లేకుండా బతికేయాల్సి వస్తుందేమో అని అంటుంది. దీంతో ప్రభాస్.. నీ టైమ్ స్టార్ట్ అయింది బుజ్జి పదా అంటారు. ఆ తర్వాత కారుపై కవర్ తీస్తారు. కానీ బుజ్జిని మాత్రం చూపించలేదు. మే 22వ తేదీన పరిచయం చేస్తామంటూ మేకర్స్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ బుజ్జి ప్రోమో వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది.

అయితే వీడియోలో గ్యాడ్జెట్ డైలాగ్స్ కు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. మొత్తానికి నాగ్ అశ్విన్.. కల్కి ప్రమోషన్లు వేరే లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాతో అందరినీ ఫ్యూచర్ వరల్డ్ లోకి తీసుకెళ్లనున్నారట నాగ్ అశ్విన్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు నటిస్తున్న మూవీ.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన విడుదల కానుంది.