Begin typing your search above and press return to search.

ప్రభాస్ కల్కిలో ఊహించని సర్ ప్రైజ్..!

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 AD సినిమాలో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఉంబోతుందని టాక్

By:  Tupaki Desk   |   31 Aug 2023 8:18 AM GMT

ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 AD సినిమాలో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఉంబోతుందని టాక్. సినిమాలో ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తుండగా ఈ బజ్ సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు సినిమాలో దర్శక ధీరుడు రాజమౌళిని కూడా కేమియో రోల్ చేయిస్తున్నారని టాక్. తన సినిమాలతో టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న రాజమౌళి RRR తో తెలుగు సంగీతానికి ఆస్కార్ వచ్చేలా చేశారు. RRR సినిమాకు వచ్చింది ఒక్క ఆస్కార్ మాత్రమే అయినా ఆ టైమ్ లో సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేశారు.

అలాంటి రాజమౌళి హ్యాండ్ ఏ సినిమాలో పడితే ఆ సినిమా లెక్క మారిపోతుంది. పుష్ప సినిమాని కూడా రాజమౌళి చెప్పారనే సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప రాజ్ చేసిన బీభత్సం ఏంటో అందరికి తెలిసిందే. తను డైరెక్ట్ చేసిన సినిమాలకే కాదు పాన్ ఇండియా రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమాకు రాజమౌళి ప్రోత్సాహం అందిస్తారు. ఈ క్రమంలోనే కల్కి సినిమాకు కూడా తన సపోర్ట్ అందిస్తున్నారట రాజమౌళి. కల్కి లో రాజమౌళి పాత్ర ఏంటి కేవలం ఆన్ స్క్రీన్ మాత్రమేనా ఆఫ్ స్క్రీన్ లో కూడా జక్కన్న ప్రమేయం ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

కల్కి 2898 AD సినిమా టీజర్ తోనే సినిమా మ్యాటర్ ఏంటన్నది అర్ధమైంది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. సినిమాలో దీపిక పడుకొనే, దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని భారీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అయితే వాటిలో కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమా ఒక్కటీ లేదు. అందుకే కల్కి విషయంలో టార్గెట్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు.

కల్కి కన్నా ముందు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అంటూ రాబోతున్నాడు ప్రభాస్. రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్ అంచనాలను అందుకోలేదు కాబట్టి సలార్ పార్ట్ 1 మీదే రెబల్ ఫ్యాన్స్ ఆశల్ని పెట్టుకున్నారు. సలార్ మాస్ కమర్షియల్ మూవీగా వస్తుండగా కల్కి మాత్రం మరో కొత్త ప్రపంచలోకి ఆడియన్స్ ని తీసుకెళ్లేందుకు రెడీ అవుతుంది. కల్కి ముందు 2024 జనవరి రిలీజ్ అనుకోగా అది సమ్మర్ కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.