Begin typing your search above and press return to search.

కల్కిలో జక్కన్న హ్యాండ్..?

హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. దీపికా పదుకునే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:59 AM GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు రానటువంటి సరికొత్త కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందనేది ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కల్కి ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది.

హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. దీపికా పదుకునే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. అమితాబచ్చన్ లార్డ్ పరశురాం అవతారంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ అయితే విష్ణు మూర్తి చివరి అవతారం అయిన కల్కి పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

లార్జర్ దెన్ లైఫ్ అనే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉందని ఇప్పటికే సినీ విశ్లేషకులు అంటున్నారు. కచ్చితంగా హాలీవుడ్ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతిని కల్కి మూవీ ఘనంగా రిప్రజెంట్ చేస్తుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. సినిమాలో రాజమౌళి క్యామియో రోల్ పోషిస్తున్నారంట.

అతని పాత్ర చాలా ఇంటరెస్టింగ్ లో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ కల్కి మూవీలో ఓ పాత్రలో కనిపించాబోతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి కూడా నటిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది.

అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది చిత్ర యూనిట్ అఫీషియల్ గా క్లారిటీ ఇస్తేగాని తెలియదు. అయితే నాగ్ అశ్విన్ టీం మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండటం వలన ఇలాంటి రూమర్స్ పై పెద్దగా రియాక్ట్ కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ఒక వేళ రాజమౌళి కల్కి సినిమాలో ఏ విధంగా భాగమైన చిత్రం యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.