Begin typing your search above and press return to search.

ప్రభాస్ క్రేజ్ తగ్గిందా..? ఏంటి ఈ రిజల్ట్...!

ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD గ్లింప్స్ కి మాత్రం ఎక్కువ వ్యూస్ రాకపోవడం గమనార్హం.

By:  Tupaki Desk   |   22 July 2023 6:13 AM GMT
ప్రభాస్ క్రేజ్ తగ్గిందా..? ఏంటి ఈ రిజల్ట్...!
X

పాన్ ఇండియా స్టార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 AD. మొన్నటి వరకు ప్రాజెక్ట్ కే పేరిట ఈ మూవీని పిలుస్తూ వచ్చారు. కాగా, అమెరికాలో 'శాన్ డియాగో కామిక్ కాన్‌' ఈ వెంట్ లో మూవీ టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా విడుదల చేశారు. కాగా, గ్లింప్స్ అదిరిపోయాయి.

మొదట ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి చాలా మంది విమర్శించారు. చీప్ ఎడిటింగ్, ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని కొందరు, మరో ఆదిపురుష్ అవ్వడం ఖాయమంటూ విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ, ఒక్కసారి గ్లింప్స్ రిలీజ్ చేసి, అందరి నోళ్లు మూతబడ్డాయిట్రోల్స్ అన్నీ పక్కకుపోయి, ప్రతి ఒక్కరూ వావ్ అనేస్తున్నారు.

ఆ గ్లింప్స్ చూస్తున్నంత సేపు చాలా మందికి రోమాలు నిక్క పొడుచుకున్నాయి. ఒక్కో సీన్ కళ్లుచెదిరిపోయేలా ఉంది. అసలు ప్రభాస్ ఎలాంటి రోల్ చేస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడగా, ఆయన కల్కి భగవానుడి పాత్రలో నటిస్తున్నాడు అని ఈ గ్లింప్స్ తో తెలిసిపోయింది. అయితే, అంత బాగున్న ఈ గ్లింప్స్ ఇప్పటి వరకు ఎలాంటి రికార్డు క్రియేట్ చేయకపోవడం విశేషం.

నిజానికి ఏదైనా సూపర్ స్టార్ మూవీకి సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చిన ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. తమ హీరో టీజర్, ట్రైలర్ గ్లింప్స్ ఇలా ఏదైనా సరే, రికార్డులు బ్రేక్ చేయాలని అనుకుంటారు. అసలు బాగోని సినిమాల టీజర్, ట్రైలర్లు కూడా రికార్డులు క్రియేట్ చేసినవి ఉన్నాయి. అంతెందుకు ఈ మధ్యాకాలంలో విడుదలైన కొన్ని చిన్న సినిమాలు కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

అలాంటిది, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 AD గ్లింప్స్ కి మాత్రం ఎక్కువ వ్యూస్ రాకపోవడం గమనార్హం. విడుదల చేసిన 24గంటలకు కేవలం 11మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. దీనికంటే కొద్ది రోజుల క్రితం విడుదలైన సలార్ కి మాత్రం అలా జరగలేదు.

సలార్ కి 80 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి, కేవలం ఈ సినిమాకే ఇలా ఎందుకు జరిగిందనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న ప్రభాస్ వీడియోకి ఇంత తక్కువ వ్యూస్ రావడం ఏంటి అనే సందేహాలు మొదలౌతున్నాయి.

అయితే దీనికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. ఈ గ్లింప్స్ ఇండియాలో అర్ధరాత్రి రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాబట్టి అది కూడా ఒక రీజన్. కానీ మళ్ళీ మళ్ళీ చూసేంత స్టఫ్ అయితే ఇందులో లేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఆయన గత సినిమాల ఫలితాల ప్రభావం, ఈ మూవీ పై పడుతుందేమో, లేక ప్రభాస్ క్రేజ్ తగ్గిందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాన్ వంటి వారు నటిస్తుండటం విశేషం.