Begin typing your search above and press return to search.

ప్రభాస్ తో ఐటెమ్ సాంగ్.. ఆ రేంజ్ లో ఉండాలా..

అయితే ప్రభాస్ తో ఐటెం సాంగ్ అంటే అంచనాలను గట్టిగానే ఉంటాయి. అందుకే దర్శకుడు మారుతి హై లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 12:09 PM GMT
ప్రభాస్ తో ఐటెమ్ సాంగ్.. ఆ రేంజ్ లో ఉండాలా..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలతో చాలా బిజీ బిజీగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం దర్శకుడు ట్రైలర్ విడుదల చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక మరోవైపు ప్రభాస్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే ప్రభాస్ ఎక్కువగా మారుతి సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ లోనే పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎప్పటికప్పుడు కొన్ని గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాను మారుతి కామెడీ హారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు అని, అలాగే రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు చాలా కాలంగా కొన్ని కథనాలు అయితే వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా చర్చల్లో మరొక టైటిల్ కూడా ఉన్నట్లు టాక్ వచ్చింది. ఇక ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ బాహుబలి సినిమాలో చివరగా ఐటెం సాంగ్ తో కనిపించాడు. మళ్ళీ ఆ తర్వాత ఏ సినిమాల్లో కూడా ఆ టైమింగ్ అయితే దొరకలేదు. ఇక ఇప్పుడు మారుతి సినిమాలో ఆ స్పేస్ దొరికినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రభాస్ తో ఐటెం సాంగ్ అంటే అంచనాలను గట్టిగానే ఉంటాయి. అందుకే దర్శకుడు మారుతి హై లెవెల్ లోనే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా బాలీవుడ్ నుంచి స్టార్ బ్యూటీలను రప్పించే అవకాశం ఉందట. ఇక ప్రస్తుతం లిస్టులో అయితే ఆలియా భట్ పేరుతో పాటు కరీనాకపూర్ లాంటి సీనియర్ బ్యూటీల పేర్లు కూడా చర్చల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇంకా పేర్లు ఫైనల్ కాలేదు కానీ మరో లిస్టు సిద్ధం చేసిన తర్వాత ఎవరు ఓకే అనిపిస్తే వారితో ఐటెం సాంగ్ కు ఫిక్స్ చేయాలి అని మారుతి టీం రెడీ అవుతుంది. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాలో డిఫరెంట్ స్టైల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు.