Begin typing your search above and press return to search.

హిందీ బెల్ట్‌లో ప్ర‌భాస్ బెస్ట్ అండ్ వ‌రస్ట్

ఈ సంద‌ర్భంగా హిందీ బెల్ట్ లో ప్ర‌భాస్ బెస్ట్ ఏది? వ‌ర‌స్ట్ ఏది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:17 PM GMT
హిందీ బెల్ట్‌లో ప్ర‌భాస్ బెస్ట్ అండ్ వ‌రస్ట్
X

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన భారీ పాన్ ఇండియ‌న్ సినిమా స‌లార్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా సుదీర్ఘ సెల‌వుల‌ను ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమా వ‌స్తోంది. కింగ్ ఖాన్ షారూఖ్ న‌టించిన డంకీతో పోటీప‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌నుంది.

ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన స‌లార్ పై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌భాస్ కి హిందీ బెల్ట్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఖాన్ ల‌కు ధీటుగా ఉత్త‌రాదిన వ‌సూలు చేసే స‌త్తా ఉంద‌ని ప్రూవైంది. ఈ సంద‌ర్భంగా హిందీ బెల్ట్ లో ప్ర‌భాస్ బెస్ట్ ఏది? వ‌ర‌స్ట్ ఏది? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

హిందీ ప‌రిశ్ర‌మ‌లో అప్ప‌టివ‌ర‌కూ ఉన్న రికార్డుల‌న్నిటినీ బ‌ద్ధ‌లుకొట్టిన సినిమా బాహుబ‌లి 2. ఇది ప్రభాస్ కి హిందీ బెల్ట్ లో ది బెస్ట్ గా నిలిచింది. బాహుబ‌లి- ది బిగినింగ్‌తో అద్భుత విజ‌యం అందుకుని బాహుబ‌లి- ది క‌న్ క్లూజ‌న్ తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు ప్ర‌భాస్. బాహుబలి 2 హిందీ బెల్ట్ లో మొద‌టి రోజు 40కోట్లు వ‌సూలు చేయ‌గా, 3రోజుల‌కు (తొలి వీకెండ్ నాటికి) 128కోట్లు వ‌సూలు చేసింది. తొలి వారాంతానికి 247 కోట్లు వ‌సూలు చేయ‌గా, లైఫ్ టైమ్ 510 కోట్లతో సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టికి ఉన్న హిందీ ప‌రిశ్ర‌మ రికార్డుల‌న్నిటినీ ఈ సినిమా తిర‌గ‌రాసింది. అందుకే ఇది ప్ర‌భాస్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

ప్ర‌భాస్ కెరీర్ వ‌రస్ట్ సినిమాలుగా ఆదిపురుష్ - రాధేశ్యామ్ నిలిచాయి. ఆదిపురుష్ 3డి - 36కోట్లు ఓపెనింగ్ లతో మొద‌లై ఓపెనింగ్ వీకెండ్ నాటికి, 3రోజుల్లో 121కోట్లు వ‌సూలు చేసింది. లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్స్ 135 కోట్లు. పురాణేతిహాసం రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఆదిపురుష్ లో ప్ర‌భాస్ అద్భుతంగా న‌టించినా కానీ, ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు చేసిన పొర‌పాట్లు అత‌డికి కూడా బ్యాడ్ నేమ్ తెచ్చాయి. కేవ‌లం ప్ర‌భాస్ ఛ‌రిష్మాతో ఆదిపురుష్ అసాధార‌ణ ఓపెనింగులు తేగ‌లిగింది.

బాహుబ‌లి త‌ర్వాత సాహో లాంటి భారీ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు ప్ర‌భాస్. ఈ సినిమాకి ఉన్న హైప్ దృష్ట్యా భారీ ఓపెనింగులు సాధ్య‌మ‌య్యాయి. సాహో హిందీ బెల్ట్ లో పెద్ద విజ‌యం సాధించింది.

సాహో తొలిరోజు 25 కోట్లు వ‌సూలు చేయ‌డ‌మే గాక‌, తొలి వీకెండ్ నాటికి 80కోట్లు రాబ‌ట్టింది. తొలి వారాంతానికి 116 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం లైఫ్ టైమ్ 143 కోట్లు వ‌సూలు చేసింది.

అటుపై రాధేశ్యామ్ ఒక భారీ సాహ‌సం. ప్రభాస్ కొత్త ద‌ర్శ‌కుడితో ప్రేమ‌క‌థా చిత్రం చేయ‌డం విక‌టించింది. ఈ చిత్రం ఓపెనింగ్ డే 5కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేయ‌గా, ఓపెనింగ్ వీకెండ్ 14కోట్లు వ‌సూలు చేసింది. తొలి వారం చివ‌రి నాటికి 18.20కోట్లు వ‌సూలు చేసినా, లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్స్ 19.30 కోట్లు మాత్ర‌మే. ఈ సినిమా ప్ర‌భాస్ కెరీర్ లోనే హిందీ బెల్ట్ లో వ‌ర‌స్ట్ గా నిలిచింది. కొత్త ద‌ర్శ‌కులు సుజీత్, రాధాకృష్ణ‌ల‌తో ప్ర‌భాస్ చేసిన రెండు ప్ర‌యోగాలు ఆశించ‌న ఫ‌లితాన్నివ్వ‌లేదు. ఓంరౌత్ లాంటి ద‌ర్శ‌కుడిపై పెట్టుకున్న న‌మ్మ‌కం కూడా వ‌మ్ము అయింది. ఇప్పుడు వీట‌న్నిటికీ స‌మాధానంగా స‌లార్ తో ప్ర‌భాస్ వ‌స్తున్నాడు. ప్ర‌శాత్ నీల్ అప‌ప్ర‌ద‌ల‌న్నిటినీ తొల‌గిస్తాడ‌నే ఆశిస్తున్నాడు. జ‌స్ట్ వెయిట్.. ఇంకో నెల‌రోజులే డెడ్ లైన్.