Begin typing your search above and press return to search.

LCUలో ప్రభాస్​ ఉన్నాడా లేడా?.. క్లారిటీ ఇచ్చేసిన లోకేశ్

ఖైదీ, విక్రమ్ చిత్రాలకు లింక్ పెట్టారు. ఇక ఇప్పుడు లియో కూడా ఎల్‍సీయూలో భాగమేనని ప్రచారం సాగుతోంది.. కానీ ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 7:14 AM GMT
LCUలో ప్రభాస్​ ఉన్నాడా లేడా?.. క్లారిటీ ఇచ్చేసిన లోకేశ్
X

దర్శకుడు లోకేశ్​ కనగరాజ్​.. ఇటీవలే పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​లో (LCU) భాగమా కాదా అన్న అనుమానాలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు లోకేశ్​ కనగరాజ్​.

వివరాళ్లోకి వెళితే.. లోకేశ్​ కనగరాజ్​.. తన చిత్రాలను కనెక్ట్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్​ను సృష్టించారు. ఖైదీ, విక్రమ్ చిత్రాలకు లింక్ పెట్టారు. ఇక ఇప్పుడు లియో కూడా ఎల్‍సీయూలో భాగమేనని ప్రచారం సాగుతోంది.. కానీ ఇంకా దీనిపై స్పష్టత రాలేదు. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​లోనే ప్రభాస్ సినిమా గురించి ఆ మధ్య అనౌన్స్​ చేశారు.

తాజాగా మరో ప్రమోషన్స్​లో ప్రభాస్​ సినిమా.. ఎల్​సీయూలో భాగామా కాదా అనే విషయమై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‍తో తాను చేసే సినిమా ఎల్‍సీయూలో భాగం కానేకాదని చెప్పేశారు. ఈ చిత్రం స్టాండ అలోన్​గా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. తన గత సినిమాలకు, ప్రభాస్‍తో చేసే చిత్రానికి సంబంధం ఉండదని అన్నారు.

ప్రభాస్​ కోసం ఒక ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని లోకేశ్ చెప్పారు. దీంతో ప్రభాస్ - లోకేశ్ సినిమాపై అభిమానుల్లో మరింత హైప్​ పెరిగింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరో రెండేళ్ల సమయమైనా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి వీరిద్దరి చేతిలో చాలా ప్రాజెక్ట్​ ఉన్నాయి.

ఇకపోతే లోకేశ్​.. తన తర్వాతి సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్​తో తలైవార్​ 171 చేస్తున్నారు. ఇది కూడా స్టాండ్ అలోన్​గా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టి కార్తి ఖైదీ 2, కమల్​ హాసన్​ విక్రమ్ 2, సూర్యతో రోలెక్ట్​ ఎల్​సీయూలో భాగం అవుతాయని తెలిసింది. అలాగే లోకేశ్​ మెగా పవర్ స్టార్​ రామ్​చరణ్​తోనూ ఓ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎల్​సీయూలో భాగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.