Begin typing your search above and press return to search.

ప్రభాస్ కత్తి పడితే కోత ఇలాగే ఉంటుంది

ప్రశాంత్‌ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ను చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:35 AM GMT
ప్రభాస్ కత్తి పడితే కోత ఇలాగే ఉంటుంది
X

ప్రభాస్ వంటి సాలిడ్ ఫిజిక్‌ హీరో... పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న సాలిడ్ మాస్ ఫాలోయింగ్ ను రెండు సరిగ్గా ఉపయోగించుకుంటే బాక్సాఫీస్ వద్ద ఊచకోత తప్పదు అని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ సలార్ సినిమా తో నిరూపించాడు. నిన్న విడుదల అయిన సలార్‌ సినిమా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులను నమోదు చేయబోతుంది.

ప్రశాంత్‌ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ను చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. బాహుబలి లో రాజమౌళి ఎలా అయితే ప్రభాస్ ను చూపించి పాన్‌ ఇండియా స్టార్‌ గా నిలిపాడో.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా సలార్ లో ప్రభాస్‌ ని చూపించి పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ క్రేజ్ ని మరింత పెంచాడు.

బాహుబలి సినిమాలో ప్రభాస్‌ కత్తి పట్టి తిప్పుతూ ఉంటే ముందు ఉన్న శత్రువులు ఏమో కానీ, స్క్రీన్ ముందు ఉన్న ప్రేక్షకుల మనసులు ఊచ కోత కోసినట్లుగా అనిపించింది. ఇప్పుడు అచ్చు అలాగే ప్రభాస్ తో కత్తి పట్టించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ బాక్సాఫీస్ ను ఊచకోత కోయించాడు అనడంలో సందేహం లేదు.

ఈ సమయంలో బాహుబలి లో ప్రభాస్ కత్తి పట్టిన స్టిల్స్‌ ను ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. రాజమౌళి మరియు ప్రశాంత్‌ నీల్‌ మాత్రమే ప్రభాస్ ను మరియు ఆయన చేతిలోని కత్తిని సరిగ్గా సద్వినియోగం చేసుకున్నారు అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఎక్స్ లో తెగ ట్రెండ్‌ చేస్తున్నారు.

సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌ లో ప్రభాస్ ఇమేజ్ ను చూపించిన తీరు గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ను ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ బాహుబలి లో కత్తి పట్టి యుద్ధం చేస్తే వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇప్పుడు కత్తి పట్టి మళ్లీ వెయ్యి కోట్లు కొల్లగొట్టబోతున్నాడు. అందుకే ప్రభాస్ కత్తి పడితే ఇలాగే ఉంటుందని నెటిజన్స్‌ సోషల్‌ మీడియాలో ఈ రెండు ఫోటోలను కలిపి తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇక సలార్‌ 2 లో ప్రభాస్ ను ఎలా చూడబోతున్నామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.