Begin typing your search above and press return to search.

ప్రభాస్- హను రాఘవపూడి.. సౌండ్ మొదలైంది!

హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   8 April 2024 1:30 PM GMT
ప్రభాస్- హను రాఘవపూడి.. సౌండ్ మొదలైంది!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా మూవీలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతేడాది చివర్లో సలార్ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. ఇటీవల కల్కి మూవీ షూటింగ్ ను పూర్తి చేశారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో రూపొందుతున్న ఈ మూవీ 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రభాస్ చేతిలో రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్ తో పాటు హను రాఘవపూడి సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో రాజా సాబ్ షూటింగ్ ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సమాచారం. సలార్ 2, స్పిరిట్ మూవీలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. 2024 లో ఈ రెండు ప్రాజెక్టులు కూడా మొదలు కానున్నాయి.

అయితే హను రాఘవపూడి సినిమా కోసం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఉందా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ప్రభాస్ తో చేస్తున్న సినిమా గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చారు హను రాఘవపూడి. వరంగల్‌ లోని ఎన్‌ ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభాస్ తో పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు పాటలు కంపోజ్ కూడా చేసినట్లు హను రాఘవపూడి తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాకయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా.. సైలెంట్ గా కానించేస్తున్నారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై హను రాఘవపూడి కామెంట్స్... సినీ ప్రియులతో పాటు అభిమానుల్లో మంచి అంచనాలు పెంచాయి.

అయితే హను రాఘవపూడి చివరగా సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతకు ముందు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, అందాల రాక్షసి, లై, పడి పడి లేచే మనసు చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పటి వరకు లవ్ స్టోరీలతో హిట్లు కొట్టిన హను రాఘవపూడి.. ప్రభాస్ తో పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కించి ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మరి.