Begin typing your search above and press return to search.

ప్రభాస్ మరో ప్రేమ కథ.. అప్పటి వరకు ఆగాల్సిందే

సీతారామం సక్సెస్ తర్వాత ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడు ప్రభాస్ ను బాగా అట్రాక్ట్ చేశాడు

By:  Tupaki Desk   |   22 July 2023 10:18 AM GMT
ప్రభాస్ మరో ప్రేమ కథ.. అప్పటి వరకు ఆగాల్సిందే
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కె కల్కీ సినిమాతో పాన్ వరల్డ్ లోకి గ్రాండ్ గా అడుగు పెట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టు తప్పకుండా అంచనాలకు మించి ఉంటుందని ఫాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దానికంటే ముందు సలార్ కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయబోతోంది. ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది.

అయితే మరోవైపు మారుతి ప్రాజెక్టుతో కూడా ప్రభాస్ బిజీగా పాల్గొంటూనే ఉన్నాడు. అయితే ప్రభాస్ లిస్టులో మరో సినిమా కూడా చేరబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నట్లు గతంలోనే ఒక ప్రకటన ఇచ్చారు. దానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు.

అయితే ప్రభాస్ మరొక సినిమాపై కూడా అధికారికంగా క్లారిటీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. సీతారామం సక్సెస్ తర్వాత ఫామ్ లోకి వచ్చిన ఈ దర్శకుడు ప్రభాస్ ను బాగా అట్రాక్ట్ చేశాడు. అయితే ప్రభాస్ కు ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడంతో బాగా నచ్చేసిందట.

రాధే శ్యామ్ తో చాలా కాలం తరువాత లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసిన డార్లింగ్ మళ్ళీ మరో మంచి ప్రేమకథను చేయాలని అనుకుంటున్నాడు. ఇక హను టైమ్ చూసి ఎట్రాక్ట్ చేశాడు. ఇక ఫైనల్ స్క్రిప్ట్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు మరికొన్ని మార్పులు చేసి త్వరలోనే ప్రభాస్ కు ఫైనల్ నెరేషన్ ఇవ్వబోతున్నాడు.

హను రాఘవపూడిపై అయితే ప్రభాస్ చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్టు విషయంలో అధికారికంగా త్వరలోనే క్లారిటీ రాబోతోంది. అక్టోబర్ 2వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేయబోతున్నారట.

ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్లోనే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆలోపు ప్రభాస్ మారుతి సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అలాగే ప్రాజెక్ట్ K కు సంబంధించిన పనులు కూడా దాదాపు అప్పుడే పూర్తి కానున్నాయి. మరి హను దర్శకత్వంలో చేయబోయే సినిమాతో ప్రభాస్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.