Begin typing your search above and press return to search.

సైలెంట్ గా రెబల్ స్టార్ సినిమా అప్డేట్ ఇచ్చాడు..!

ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ లీక్ చేశాడు. తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాల గురించి చెబుతూ నెక్స్ట్ ఒక భారీ సినిమా చేస్తున్నానని.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:30 AM GMT
సైలెంట్ గా రెబల్ స్టార్ సినిమా అప్డేట్ ఇచ్చాడు..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కల్కి మే నెలలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తో పాటుగా మారుతి డైరెక్షన్ లో సినిమా వస్తుంది. రీసెంట్ గా రాజా సాబ్ అంటూ ఆ సినిమా ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. ఇక ఈ సినిమా తర్వాత సలార్ 2 కూడా చేయాల్సి ఉంది. కల్కి కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్. అంటే సలార్ 2, కల్కి 2 సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటుగా మరో క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు ప్రభాస్.

సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపుడి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా రానుంది. ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ లీక్ చేశాడు. తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాల గురించి చెబుతూ నెక్స్ట్ ఒక భారీ సినిమా చేస్తున్నానని. హను రాఘవపుడి ప్రభాస్ కాంబో సినిమాకు పనిచేస్తున్నానని అన్నారు. సో అలా సైలెంట్ గా ప్రభాస్ సినిమా అప్డేట్ తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశారు.

సీతారామం సినిమాతోనే యుద్ధంతో రాసిన ప్రేమకథ తెరకెక్కించిన హను మరోసారి ప్రభాస్ కోసం అలాంటి బ్యాక్ డ్రాప్ నే తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సినిమా కోసం వరల్డ్ వార్ 2 నేపథ్యం తీసుకుంటున్నారట. ఈ సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చినట్టు తెలుస్తుంది. హను ప్రభాస్ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రభాస్ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా భారీ సినిమాగా హను డైరెక్షన్ లో మూవీ రాబోతుంది. సితారామం హిట్ తో కెరీర్ లో ఫుల్ జోష్ మీద ఉన్న హను ప్రభాస్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అవ్వగా మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. హను తో విశాల్ చంద్రశేఖర్ అంతకుముందు చేసిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఆ సినిమాల్లానే ఈ మూవీ కూడా ఉంటుందేమో చూడాలి. ప్రభాస్ వరుస సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నాయి. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ రెండేళ్లు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ చేసుకునేలా సినిమాలు రాబోతున్నాయి.