Begin typing your search above and press return to search.

కల్కి సీక్రెట్ వల్ల హనుమాన్‌ కి ప్రభాస్ మొండి చేయి..!

కల్కి సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రభాస్ బయటి కార్యక్రమాలకు హాజరు అవ్వద్దని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజ్ఞప్తి చేశాడట.

By:  Tupaki Desk   |   7 Jan 2024 5:58 AM GMT
కల్కి సీక్రెట్ వల్ల హనుమాన్‌ కి ప్రభాస్ మొండి చేయి..!
X

సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న సినిమాల్లో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా ను తీవ్ర పోటీ మధ్య విడుదల చేసేందుకు రెడీ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.

హనుమాన్‌ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న మా సినిమా ప్రమోషన్‌ కి హాజరు అవుతాను అన్నాడు. ఏదో ఒక రూపంలో సినిమా యొక్క ఈవెంట్‌ లో ప్రభాస్ భాగం అవుతాడు అని నమ్మకంగా ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే.

తాజాగా హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ప్రకటించారు. ఆ ఈవెంట్‌ కు మెగాస్టార్ చిరంజీవి హాజరు అవ్వబోతున్నాడు. అయితే ప్రభాస్‌ మాత్రం ఇప్పటి వరకు హనుమాన్‌ కోసం మీడియా ముందుకు రాలేదు. విడుదల కు కనీసం అయిదు రోజుల సమయం లేదు.. మరి ఎప్పుడు ప్రభాస్ వస్తాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సమయంలో ప్రభాస్‌ కల్కి సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమా కోసం ప్రభాస్ సీక్రెట్‌ మేకోవర్‌ లో కనిపించబోతున్నాడు. అందుకు గాను తన హెయిర్‌ స్టైల్ ఇతర లుక్ ను మార్చడం జరిగిందట. కల్కి సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రభాస్ బయటి కార్యక్రమాలకు హాజరు అవ్వద్దని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజ్ఞప్తి చేశాడట.

అందుకే హనుమాన్‌ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో ప్రభాస్ కనిపించే అవకాశం లేదని కొందరు అంటున్నారు. అయితే విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక ఏదో ఒక రూపంలో ప్రభాస్ ఇచ్చిన మాట మేరకు హనుమాన్‌ ను ప్రమోట్‌ చేసేందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలంటే మరో రెండు రోజులు వెయిట్‌ చేయాల్సిందే.