Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఫ్యాన్స్ బాధ అర్థమవుతోందా?

అయితే, ఈ కొత్త లుక్ లో ప్రభాస్ గ్లో తగ్గినట్టు మరియు తన ఫిట్నెస్ కొంతగా ప్రభావితమైనట్టు కనిపించింది. ఫ్యాన్స్ ఈ విషయం పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   18 May 2024 9:17 AM GMT
ప్రభాస్.. ఫ్యాన్స్ బాధ అర్థమవుతోందా?
X

ఇండియన్ సినిమా మార్కెట్ లో ప్రస్తుతం అత్యంత గిరాకీ కలిగిన బిజీ హీరోలలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ పలు భారీ ప్రాజెక్టుల కోసం తీరిక లేకుండా వర్క్ చేస్తున్నాడు, వాటిలో"కల్కి 2898 AD" ఒకటి. అలాగే "ది రాజా సాబ్" వర్క్ కూడా కొనసాగుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో ప్రభాస్ నిర్విరామంగా పాల్గొంటున్నారు.

ఇటీవల ప్రభాస్ కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్లిప్ లో ప్రభాస్ కనిపించిన నయా లుక్ అభిమానులను ఆందోళనలోకి గురి చేసింది. నార్మల్ గా ప్రభాస్ అంటేనే సాలిడ్ పర్శనాలిటీ మరియు మంచి చార్మ్ తో కనిపిస్తారు. అయితే, ఈ కొత్త లుక్ లో ప్రభాస్ గ్లో తగ్గినట్టు మరియు తన ఫిట్నెస్ కొంతగా ప్రభావితమైనట్టు కనిపించింది. ఫ్యాన్స్ ఈ విషయం పై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

ప్రభాస్ తన పని భారం వల్ల ఎక్కువ రెస్ట్ లేకుండా, తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కష్టపడుతున్నారని భావిస్తున్నారు. రెబల్ స్టార్ అభిమానులు తమ అభిమాన హీరో కొంత విరామం తీసుకొని, తన ఆరోగ్యాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నారు. నటనలో ప్రభాస్ ఎంత కష్టపడుతున్నారో అర్ధం అవుతున్నప్పటికీ.. ఆరోగ్యం కూడా ముఖ్యమే అని అభిప్రాయపడుతున్నారు.

ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాడు. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా ఎల్లప్పుడూ క్షేమం కోరుకుంటారు. కాబట్టి వారి ప్రేమను ప్రభాస్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు, ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ, మంచి కంటెంట్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసి వైరల్ అయ్యారు.

త్వరలోనే తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అనే డౌట్ క్రియేట్ చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పెళ్లికి సిద్ధమవుతున్నాడు అన్నట్లుగా కథనాలు వైరల్ అయ్యాయి. అయితే అది నిజం కాదు అని తర్వాత కల్కి సినిమా ప్రమోషన్స్ ని బట్టి అర్థమైంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగానే ప్రభాస్ ఆ విధంగా ఒక డౌట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశాడట. ఇక కల్కి సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ త్వరలోనే మొదలుకాబోతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ తో కూడా కలిసి ముచ్చటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.