Begin typing your search above and press return to search.

ప్రభాస్ భోజనం ఖర్చు ఆ లెవెల్లో..

వారందరికీ తన ఖర్చుతోనే భోజనం పెట్టిస్తాడు. అలాగే అన్ని రకాల వంటకాలు ప్రభాస్ భోజనంలో కచ్చితంగా మెనూగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 Dec 2023 4:22 AM GMT
ప్రభాస్ భోజనం ఖర్చు ఆ లెవెల్లో..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అనే సంగతి అందరికి తెలిసిందే. ప్రభాస్ తో వర్క్ చేసే సెలబ్రిటీలు ఎవరైనా అతని గురించి ఎక్కువగా చెప్పే మాట భోజనం పెట్టి చంపేస్తారు అని. తనతో వర్క్ చేసే సెలబ్రిటీలకి ఇష్టమైన వంటకాలు అన్ని వండించి తీసుకొచ్చి పెట్టడం ప్రభాస్ నైజం. అలాగే అతను ఎప్పుడు భోజనం చేసి తనతో పాటు ఓ పది, ఇరవై మంది కలిసి భోజనం చేయాల్సిందే.

వారందరికీ తన ఖర్చుతోనే భోజనం పెట్టిస్తాడు. అలాగే అన్ని రకాల వంటకాలు ప్రభాస్ భోజనంలో కచ్చితంగా మెనూగా ఉంటాయి. అతను ఎప్పుడు ఏది తింటాడో ఎవరికి తెలియదు. అందుకే అన్ని రకాల వంటకాలు వండేసి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ప్రభాస్ కి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఒక ఒక టీం ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది.

మెజారిటీగా గోదావరి స్టైల్ వంటకాలని ప్రభాస్ ఇష్టపడుతూ ఉంటాడు. ఒక్కోసారి సెట్ లో వర్క్ చేసే అందరికి కూడా ప్రభాస్ భోజనం తెప్పిస్తూ ఉంటాడంట. దీపికా పదుకునే, కృతి సనన్ సైతం ప్రభాస్ పెట్టె భోజనం టేస్ట్ చేసినవారే. అతను పెట్టె ఫుడ్ తింటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే డైట్ మర్చిపోవాల్సిందే అని హీరోయిన్స్ కామెంట్స్ చేసారంటే ఎంతలా ఫుడ్ పెడతాడో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక రాత్రి భోజనం ఖర్చు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ చర్చ నడుస్తోంది. సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఒక రాత్రి ఫుడ్ కోసం ప్రభాస్ ఖర్చు చేస్తారంట. ఈ స్థాయిలో భోజనం కోసం ఖర్చు చేసే హీరోలు ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ పై ఇంకెవరు లేరని చెప్పాలి.

ప్రభాస్ అంటేనే ఆతిథ్యం అని ఎవరైనా కచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అలాగే కాంట్రవర్సీలకి దూరంగా ఉండే ఏకైక స్టార్ కూడా ప్రభాస్ అని చెప్పాలి. అందుకే అందరి హీరోల ఫ్యాన్స్ ప్రభాస్ మూవీస్ చూడాటానికి ఇష్టపడతారు.