Begin typing your search above and press return to search.

ప్రభాస్ FB అకౌంట్ హ్యాక్.. అనుచిత కంటెంట్ వైర‌ల్

తాజా స‌మాచారం మేర‌కు ప్రభాస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ కి గురైంది.

By:  Tupaki Desk   |   27 July 2023 3:11 PM GMT
ప్రభాస్ FB అకౌంట్ హ్యాక్.. అనుచిత కంటెంట్ వైర‌ల్
X

టాలీవుడ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్థాయికి ఎదిగింది. అదే క్ర‌మంలో అంద‌రూ ఇటువైపే చూస్తున్నారు. ఇక తెలుగు హీరోల‌ కు అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. మ‌న హీరోల్లో వ‌ర‌ల్డ్ వైడ్ భారీ ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ కి గొప్ప పేరుంది. ఇక సోష‌ల్ మీడియాల్లో అత‌డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ తన FB పేజీలో 2 కోట్ల 40ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ను కలిగి ఉన్నాడు. అత‌డు కేవ‌లం రాజమౌళిని మాత్ర‌మే ఫాలో అవుతున్నాడు. ఇన్ స్టా స‌హా ఇత‌ర మాధ్య‌మాల్లోను ప్ర‌భాస్ కి అసాధార‌ణ‌మైన ఫాలోయింగ్ ఉంది.

అయితే ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న ప్ర‌భాస్ పై హ్యాక‌ర్ల క‌న్ను ప‌డింది. తాజా స‌మాచారం మేర‌కు ప్రభాస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ కి గురైంది. అతని పేజీ లో అనుచితమైన కంటెంట్‌ ను పోస్ట్ చేశారు. దీనికి 'మానవులు దురదృష్టవంతులు' అని శీర్షిక పెట్టారు. సంబంధిత‌ వైరల్ వీడియోతో పాటు పోస్ట్ చేశారు.

అయితే ఇలాంటి చెత్త వీడియో చూశాక ప్రభాస్ అభిమానులు వాస్త‌వాన్ని గ్ర‌హించారు. వెంటనే ఈ విషయాన్ని ప్రభాస్ సోషల్ మీడియా టీమ్‌ కు తెలిపారు. హ్యాకింగ్ గురించి తెలుసుకున్న ప్రభాస్ టీమ్ దిద్దుబాటు చర్యలు చేపట్టి అధికారిక ఖాతాను తిరిగి పొందింది. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు ప్రభాస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ హ్యాక్ కి గురైంది


నిజానికి ప్ర‌భాస్ క్ష‌ణం తీరిక లేనంత బిజీ గా ఉన్నాడు. వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అందువ‌ల్ల అత‌డు సోషల్ మీడియా లో అంత చురుగ్గా లేడు. కానీ సామాజిక మాధ్య‌మాల‌ను మెయింటెయిన్ చేసే టీమ్ అత‌డికి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల ను క‌నీసం అప్పుడ‌ప్పుడూ అయినా ప‌ల‌క‌రించాల‌నే ఉద్ధేశంతో డార్లింగ్ తన అధికారిక ఎఫ్.బి పేజీ ని 18 అక్టోబర్ 2023న ఓపెన్ చేసాడు. అతను అప్పుడప్పుడు తన సినిమాల కంటెంట్ ను షేర్ చేయడానికి సహనటులతో సంభాష‌ణ‌ల కోసం ఈ పేజీని ఉపయోగిస్తున్నాడు.

ప్ర‌భాస్ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న 'స‌లార్' చిత్రం లో న‌టిస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల‌ లో ఇది ఒక‌టి. అలాగే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా కల్కి 2898 ADలోను న‌టిస్తున్నాడు. మారుతితో సినిమా ని సైలెంట్ గా పూర్తి చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లోను నటించ‌నున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన త‌దుప‌రి అప్ డేట్ లు తెలియాల్సి ఉంది.