Begin typing your search above and press return to search.

ఐనా ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి..!

సలార్‌ సినిమా కోసం భారీ ఎత్తున ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఈవెంట్స్ కి హాజరు అవ్వడం కానీ ప్రభాస్‌ చేయలేదు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 6:13 AM GMT
ఐనా ప్రభాస్‌ ఫ్యాన్స్ అసంతృప్తి..!
X

ప్రభాస్ 'బాహుబలి 2' తర్వాత సరైన సినిమాను చేయలేదు.. చేయడం లేదు అంటూ ఫ్యాన్స్ మొన్నటి వరకు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సలార్ సినిమా తో భారీ విజయం దక్కించుకోవడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ల ఎదురు చూపులకు తెర పడింది అంటూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్ లో ఉన్నారు.

ఈ సమయంలో కూడా కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి తో ఉన్నాడు. వారి అసంతృప్తికి కారణం సలార్‌ విడుదలకు ముందు కానీ, ఆ తర్వాత కానీ ప్రభాస్ మీడియా ముందుకు ఎక్కువ రాకపోవడం. ఔను ప్రభాస్ ఈ మధ్య కాలంలో మీడియాలో అస్సలు కనిపించడం లేదు. మీడియా ముందుకు ఆయన రాకపోవడంతో ఫ్యాన్స్ మిస్‌ అవుతున్నారు.

సలార్‌ సినిమా కోసం భారీ ఎత్తున ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, ఈవెంట్స్ కి హాజరు అవ్వడం కానీ ప్రభాస్‌ చేయలేదు. దాంతో ఆయన సలార్ సినిమా విడుదల తర్వాత అయినా మీడియా ముందుకు వస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ సలార్‌ విడుదల తర్వాత కూడా ప్రభాస్ నుంచి కనీసం వీడియో బైట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్‌ సలార్‌ కి ముందు రాజమౌళి ఇంటర్వ్యూతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చాలా యాక్టివ్ గా కనిపించాడు. అలాంటి ఇంటర్వ్యూలో మరో రెండు మూడు వస్తే బాగుండేది అంటూ రెబల్‌ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు.

ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రభాస్ తన స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ మీడియా ప్రజెన్స్ గురించి కొందరు కాస్త అసంతృప్తితో ఉన్నారు. మొత్తానికి ప్రభాస్‌ ఫ్యాన్స్ ఏళ్ల ఎదురు చూపులకు తెర పడ్డా కూడా కాస్త అసంతృప్తి అయితే కంటిన్యూ అవుతుందన్నమాట.