Begin typing your search above and press return to search.

ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఇది కిక్కిచ్చేదే..

అలాగే రాజాసాబ్ సినిమాలో డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయంట. మూవీలో ఏకంగా 4 సాంగ్స్ ని థమన్ డిజైన్ చేస్తున్నాడంట

By:  Tupaki Desk   |   6 Feb 2024 4:10 AM GMT
ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఇది కిక్కిచ్చేదే..
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాజాసాబ్. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఎం మూవీలో ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ ని మారుతి పెట్టారు. మూవీ కథాంశం ప్రకారం కథ మొత్తం ఒక ప్యాలస్ లోనే జరగనుందంట. అలాగే ఆ ప్యాలస్ జమీందారు వారసుడిగా ప్రభాస్ పాత్ర ఉంటుందంట.

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో మూవీ అయితే రాలేదు. రాధేశ్యామ్ కూడా ప్యూర్ లవ్ స్టోరీగా వెళ్ళిపోయింది తప్ప ఎంటర్టైన్మెంట్ లేదు. ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ మళ్ళీ బుజ్జిగాడు, డార్లింగ్, ఏక్ నిరంజన్ లాంటి కామెడీ కంటెంట్ ని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రాజాసాబ్ తో అలాంటి కామెడీ కంటెంట్ ని మారుతి డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇవ్వబోతున్నాడు.

అలాగే రాజాసాబ్ సినిమాలో డాన్స్ నెంబర్స్ కూడా ఉంటాయంట. మూవీలో ఏకంగా 4 సాంగ్స్ ని థమన్ డిజైన్ చేస్తున్నాడంట. అందులో మూడు సాంగ్స్ హీరోయిన్స్ తో డ్యూయెట్స్ కాగా ఒకటి స్పెషల్ సాంగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే థమన్ రెండు సాంగ్స్ ని కంపోజ్ చేసి ఇచ్చేశాడంట. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోంది.

ఈ ఏడాది ఆఖరులో రాజాసాబ్ చిత్రాన్ని తీసుకురావాలని మారుతి అనుకుంటున్నారు. 2025 సంక్రాంతి రేసులో నిలబెట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి రేసులో మూవీ ఉంటే మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాటల ప్రకారం ప్రభాస్ డాన్స్ ని అయితే కచ్చితంగా రాజాసాబ్ సినిమాలో చూడొచ్చని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మేలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలాగే సలార్ 2 మూవీ కూడా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ ఉండే ఛాన్స్ ఉంది.