Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఎఫెక్ట్.. మొత్తం షేకయ్యిందిగా..

ఎందుకంటే సలార్ వాయిదా పడితే.. ఆ రోజు కాస్త అటు ఇటు తమ చిత్రాలను రిలీజ్ చేయాలని మేకర్స్​ కాచుకుని ఉన్నారు.

By:  Tupaki Desk   |   4 Sep 2023 1:23 PM GMT
ప్రభాస్ ఎఫెక్ట్.. మొత్తం షేకయ్యిందిగా..
X

ఇప్పుడు ఫిల్మ్​ ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్​పై గందరగోళ పరిస్థితి కనపడుతోంది​. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో ఎక్కువగా ఉంది. ఫిల్మ్​ మేకర్స్ అంతా తమ సినిమాల విడుదల విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. అందుకు కారణం ఒకే ఒక్క సినిమా. అదే 'సలార్​'. ఈ ఒక్క సినిమా రిలీజ్​ డైట్​ పోస్ట్​ పోన్​ ప్రచారం ఒక్కసారిగా పాన్ ఇండియా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్​ చేసేసింది. దర్శకనిర్మాతల గుండెల్లో గుబులు పుట్టించేసింది.

అసలీ సినిమా సెప్టెంబర్ 28కి వచ్చేస్తుందని అంతా అనుకుని.. మిగత సినిమాల మూవీటీమ్స్​​ అంతా.. ఆ సమయానికి ముందు వెనక బెర్త్​లను లాక్ చేసుకున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి వరకు అన్నీ సీజన్​లను బుక్​ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సలార్​ పోస్ట్​పోన్​ వార్తతో అంతా తలకిందులు అయిపోయింది. దీంతో సలార్ కొత్త రిలీజ్ డేట్ బాంబ్​.. తమపై వచ్చి ఎక్కడ పడుతుందా అనే ఆందోళనతో తన సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలీక సతమతమవుతున్నారు.

అయితే ఇదే సమయంలో 'సలార్'​ రిలీజ్ వాయిదా మేకర్స్ కన్ఫామ్ చేయకపోయినప్పటికీ.. అది పక్కా అని క్లారిటీ అయిపోయింది. ఎందుకంటే సలార్ వాయిదా పడితే.. ఆ రోజు కాస్త అటు ఇటు తమ చిత్రాలను రిలీజ్ చేయాలని మేకర్స్​ కాచుకుని ఉన్నారు. తాజాగా యంగ్ హీరో కిరణ్​ అబ్బవరం రూల్స్​ రంజన్​ సెప్టెంబర్​ 28న రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా ఇచ్చేసింది. ఇతర చిత్రాలు కూడా ఆ దిశగా రెడీ అయిపోతున్నాయి.

రవితేజ టైగర్ నాగేశ్వరరావు, రామ్ పోతినేని స్కంద కూడా సలార్ రిలీజ్ డేట్​పైనే కన్నేశాయన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు కూడా దాదాపుగా ఇదే విడుదల తేదీని కన్ఫామ్​ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. అసలీ చిత్రం బాలయ్య భగవంత్ కేసరి, దళపతి విజయ్​ లియోతో పాటు అక్టోబర్ 20న విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ సమయంలో పోటీ కాస్త ఎక్కువగా ఉండటం వల్ల రిలీడ్​ డేట్​ను మార్చే విషయంపై మేకర్స్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే ఈ మూవీటీమ్​ ఏక్​ దమ్​ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. అయితే దీనిపై అక్టోబర్​ 20 రిలీజ్ డేట్​ స్టాంప్​ను తొలిగించింది. దీంతో ఈ సినిమా సెప్టెంబర్​ 28న లేదా 29న రావడం ఖాయమని తెలుస్తోంది.

అలాగే బోయపాటి-రామ్ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు రెడీ అయింది కానీ.. ఇప్పుడు సలార్​ రిలీజ్​ డేట్​ సెప్టెంబర్​ 28న వచ్చేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఇంకా సితార ఎంటర్​టైన్మెంట్​​ బ్యానర్​లో రూపొందిన మ్యాడ్ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్​కు రెడీ కూడా అయిపోయింది. అలా మొత్తంగా ఒక్క సలార్​ రిలీజ్ పోస్ట్ పోన్​ ప్రచారం మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసి.. గందరగోళ పరిస్థితిని క్రియేట్​ చేసింది. రిలీజ్ డేట్ క్లాషెస్​ సిట్యూయేషన్​ను​ నెలకొల్పింది. ఏదేమైనప్పటికీ ఈ రిలీజ్​ డేట్ల గోలపై వచ్చే వారంలోగా ఓ క్లారిటీ వస్తుంది.