Begin typing your search above and press return to search.

డార్లింగ్ ప్ర‌భాస్‌తో ఉంటే చ‌లీ గిలీ జాన్తా న‌య్!

తాజాగా మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ల గురించిన‌ గ్లింప్స్‌ని తాజా అప్‌డేట్‌లను షేర్ చేయ‌డం ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   7 March 2024 6:16 PM GMT
డార్లింగ్ ప్ర‌భాస్‌తో ఉంటే చ‌లీ గిలీ జాన్తా న‌య్!
X

సాహోలో శ్ర‌ద్ధా క‌పూర్, రాధేశ్యామ్ లో పూజా హెగ్డేతో రొమాన్స్ చేసాడు డార్లింగ్ ప్ర‌భాస్. ఇప్పుడు అత‌డు దీపిక ప‌దుకొనే, దిశా ప‌టానీ లాంటి అంద‌గ‌త్తెల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. అత‌డు న‌టిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD' నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తోంది.

తాజాగా మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్‌ల గురించిన‌ గ్లింప్స్‌ని తాజా అప్‌డేట్‌లను షేర్ చేయ‌డం ప్రారంభించారు. ఈ చిత్రంలోని ఒక పాటను చిత్రీకరించడానికి చిత్ర‌బృందం ఇటలీకి వెళ్లింది. కల్కి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసారు. ''ఎ డార్లింగ్ పిక్ .. ఇటలీ డైరీస్.. ప్ర‌భాస్ - దిశా ప‌టానీ..'' అంటూ వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికే విమానంలో ప్ర‌భాస్ - దిశా పటాని విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. డార్లింగ్ ప్ర‌భాస్ చిరునవ్వు చిందిస్తుండ‌గా కెమెరా ఫ్లాష్ లు మెరిపిస్తున్న దిశా జాలీగా క‌నిపిస్తోంది.

ఇప్పుడు ఇటలీలోని లైవ్ లొకేష‌న్ లో షూటింగ్ కోసం రెడీ అవుతున్న ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. ప్ర‌భాస్- దిశా ప‌టానీ జోడీ ఇట‌లీలోని బీచ్ లొకేషన్ లో చ‌లి కోట్లు ధ‌రించి క‌నిపిస్తున్నారు. ప్ర‌భాస్ ఎప్ప‌టిలానే మ్యాన్లీగా క‌నిపిస్తుంటే, దిశా ప‌టానీ పూర్తిగా బ‌రువైన‌ దుప్ప‌టి లాంటి కోట్‌లో మునిగిపోయింది. అక్క‌డ చ‌లి వాతావ‌ర‌ణం కావ‌డంతో ఇద్ద‌రూ అందుకు సంబంధించిన జాగ్ర‌త్త‌లు తీసుకున్నారని అర్థ‌మ‌వుతోంది. డార్లింగ్ ప్ర‌భాస్‌తో ఉంటే చ‌లీ గిలీ జాన్తా న‌య్ అంటూ ఒక అభిమాని ఈ ఫోటోల‌పై కామెంట్ చేయ‌గా, ప్ర‌భాస్ చెంత ఎవ‌రా బ్యూటీ? అంటూ మ‌రో అభిమాని వ్యాఖ్యానించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్‌ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ఇత‌ర కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రం మే9న‌ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ప్ర‌భాస్ త‌దుప‌రి మోస్ట్ అవైటెడ్ 'సలార్' సీక్వెల్ స‌లార్ పార్ట్ 2: శౌర్యంగ పర్వంలో న‌టించేందుకు సిద్ధమవుతున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ లోను న‌టించ‌నున్నాడు.