Begin typing your search above and press return to search.

అప్పటివరకు ప్రభాస్ కష్టమే..

కల్కిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాదిలో మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కానుంది.

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:58 AM GMT
అప్పటివరకు ప్రభాస్ కష్టమే..
X

డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి 2898 ఏడీ మూవీ మే నెలలో రిలీజ్ కాబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఏకంగా 22 భాషలలో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ సినిమా రాబోతోంది.

కల్కిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత ఈ ఏడాదిలో మంచు విష్ణు కన్నప్ప మూవీ కూడా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మహాశివుడిగా ప్రభాస్ కనిపించబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తోన్న రాజాసాబ్ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది ఆఖరులో లేదంటే జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.

వీటి తర్వాత వచ్చే ఏడాది సలార్ 2, కల్కి సీక్వెల్ రిలీజ్ కానున్నాయి. సలార్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కల్కి సీక్వెల్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంది. వీటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ రానుంది. ఈ మూవీ 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ సినిమాలు అన్ని పూర్తయ్యాక హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని పట్టాలు ఎక్కించనున్నాడు. లోకేష్ కనగరాజ్ కూడా ప్రభాస్ తో ఒక మూవీ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తానని గతంలోనే చెప్పారు. బోయపాటి శ్రీను కూడా హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథని ప్రభాస్ కోసం సిద్ధం చేసుకున్నారంట.

ఈ సినిమాలు పట్టాలు ఎక్కాలంటే కనీసం నాలుగేళ్లు ఎదురుచూడాల్సిందే. ఓవరాల్ గా ప్రభాస్ నెక్స్ట్ ఐదేళ్ల వరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడని అర్ధమవుతోంది. అతనితో సినిమాలు చేయాలని అనుకునే దర్శకులు ఎవరైనా కచ్చితంగా ఐదేళ్లు ఎదురుచూడాల్సిందే. అంత వరకు ఆయన కాల్ షీట్స్ దొరికే అవకాశం లేదని చెప్పాలి. టాలీవుడ్ లో భారీ లైన్ అప్ తో చిత్రాలు చేస్తోన్న హీరోగా ప్రభాస్ మాత్రమే ఉన్నాడనే మాట ఇప్పుడు వినిపిస్తోంది.