Begin typing your search above and press return to search.

యశ్ - ప్రభాస్ - బన్నీ.. ఎంత ఓపికో..

కేవలం యాక్టింగ్ విషయంలోనే కాకుండా వారి హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, డెడికేషన్ లో కూడా ముగ్గురు హీరోల ఓపికకు షాక్ అవ్వాల్సిందే.

By:  Tupaki Desk   |   13 March 2024 4:51 AM GMT
యశ్ - ప్రభాస్ - బన్నీ.. ఎంత ఓపికో..
X

సౌత్ ఇండస్ట్రీ స్థాయిని మరొక లెవెల్ కు తీసుకు వెళ్లిన హీరోలు ప్రభాస్ - యశ్ - బన్నీ. పాన్ ఇండియా మార్కెట్ లో వీరి కటౌట్ కు ఇప్పుడు క్రేజ్ మామూలుగా లేదు. బాహుబలి సిరీస్, కేజీఎఫ్ సిరీస్, పుష్ప సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. బాలీవుడ్ స్టార్స్ ని సైతం బీట్ చేస్తూ ఈ ముగ్గురు తన బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ వేల్యూ పెంచుకున్నారు. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు సౌత్ లో వీరే గుర్తుకొస్తారు.

డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని రీసెంట్ గా కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు హీరోలు ఇప్పుడు యూత్ కి రోల్ మోడల్స్ గా ఉన్నారని చెప్పాలి. దేశ వ్యాప్తంగా వీరికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు.

కేవలం యాక్టింగ్ విషయంలోనే కాకుండా వారి హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, డెడికేషన్ లో కూడా ముగ్గురు హీరోల ఓపికకు షాక్ అవ్వాల్సిందే. పెద్ద జుట్టు, గడ్డం మెయింటేన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లు లాంగ్ హెయిర్ తోనే ఉన్నాడు. కేజీఎఫ్ సిరీస్ కోసం యష్ కూడా లాంగ్ హెయిర్, గడ్డం ఐదేళ్ల నుంచి ఉంచుకున్నాడు. ఇప్పటికి అదే లుక్ ని యష్ మెయింటేన్ చేస్తున్నాడు.

అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర కోసం కూడా లాంగ్ హెయిర్ తో పాటు గెడ్డం ఉంచుకున్నాడు. షూటింగ్ సమయంలో విపరీతమైన డస్ట్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయిన కూడా క్యారెక్టర్ పెర్ఫెక్షన్, సినిమా మీద వారికున్న కమిట్మెంట్, డెడికేషన్ తో ఓపికగా వారి లుక్స్ ని ఐదేళ్ల పాటు మెయింటేన్ చేశారు. అందుకే ఈ ముగ్గురు హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా తమదైన ఫాలోయింగ్ తో అలరిస్తున్నారు.

ప్రభాస్ ఈ ఏడాది కల్కి 2898ఏడీ మూవీతో రాబోతున్నాడు. నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సలార్ సీక్వెల్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక మూవీ లైన్ లో ఉన్నాయి. యష్ మలయాళీ లేడీ డైరెక్టర్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. అలాగే రామాయణం సిరీస్ హిందీలో చేయబోతున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డితో ఒక సినిమా ఫైనల్ అయ్యి ఉంది.