Begin typing your search above and press return to search.

స‌డెన్‌గా షూటింగుల‌కు ప్ర‌భాస్ విరామం?

ఇటీవ‌ల వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న అత‌డు స‌డెన్ గా ఒక నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:30 AM GMT
స‌డెన్‌గా షూటింగుల‌కు ప్ర‌భాస్ విరామం?
X

డార్లింగ్ ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ 'సలార్`తో గ్రేట్ కంబ్యాక్ అంటే ఏంటో చూపించాడు. కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత అసాధార‌ణ స‌క్సెస్ తో గేమ్ ను మార్చి చూపించాడు. స‌లార్ బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్లు వసూలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ హై బడ్జెట్ సినిమాల‌ ఫ్లాప్‌లతో క‌ల‌త చెందిన‌ ప్రభాస్ ఎట్టకేలకు సూపర్ హిట్‌తో గేమ్ ఛేంజ‌ర్ గా మారాడు. ఇటీవ‌ల వ‌రుస‌గా క్రేజీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా ఉన్న అత‌డు స‌డెన్ గా ఒక నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అత‌డు తొంద‌ర్లోనే త‌న షూటింగుల‌కు విరామం ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది. గ్యాప్ లేని షూటింగుల‌తో రెస్ట్ లెస్ గా మారిన ప్ర‌భాస్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల‌ స‌లార్ - క‌ల్కి సైమ‌ల్టేనియ‌స్ గా చిత్రీక‌రించారు. క‌ల్కి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతోంది. అదే క్ర‌మంలో స‌లార్ విశ్రాంతి తీసుకోవాల‌ని అనుకుంటున్నారు. త్వ‌ర‌లో యూరోప్ లో స‌ర్జ‌రీ చేయించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కూడా తెలిసింది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్ కి సానుకూల సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్ర‌భాస్ కెరీర్ లో మరో ఉత్త‌మ విజ‌యం అందుకున్నాడు. ఇదే ఉత్సాహంలో స‌లార్ 2లోను న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. కొంత‌ విరామంతో తన జీవితంలో కొత్త శక్తిని నింపడానికి... త‌ర్వాత‌ తన కెరీర్‌పై దృష్టి సారించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాడు. ముఖ్యంగా ఆరు సంవత్సరాల నిరంతర సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత అత‌డు విరామం కోరుకుంటున్నాడు.

అయితే ప్రభాస్ విరామం కేవలం ఒక నెల మాత్రమే. అతడు తిరిగి మార్చిలో తన త‌దుప‌రి ప్రాజెక్ట్‌లను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే యూరోప్‌లో శస్త్రచికిత్స చేయించుకోవచ్చని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పాత గాయం ఒక‌టి పూర్తిగా నయం కాలేదు. దానికి చికిత్స అవ‌స‌ర‌మ‌ని కూడా చెబుతున్నారు.

ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని కల్కి AD 2898 విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తు

న్నారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలోని రాజా సాబ్ 60శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ రొమాంటిక్-హారర్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేయ‌గా అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో విడుదల కానుంది. అలాగే ప్రభాస్ త‌దుప‌రి సందీప్ వంగా తో కలిసి స్పిరిట్ అనే చిత్రానికి ప‌ని చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ ఫిబ్రవరి 2024లో ముంబైలో ప్రారంభం కానుంది. యానిమ‌ల్ గ్రాండ్ స‌క్సెస్ నేప‌థ్యంలో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి.